YS Jagan: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ సెలవులు భారీగా పెంపు..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు 60 రోజులుగా ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను..

YS Jagan: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ సెలవులు భారీగా పెంపు..
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Oct 19, 2022 | 3:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు 60 రోజులుగా ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను 180 రోజులు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఆయా సెలవులను పది విడతలుగా ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇటీవల సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.

అలాగే, అంగన్‌వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సీఎం జగన్ అన్నారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. మరోవైపు దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ల నియామకాలను ప్రారంభించాలని.. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని సీఎం చెప్పారు.

అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం వందశాతం క్వాలిటీ, క్వాంటిటీ ఆహారాన్ని పిల్లలకు అందాలే చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. అటు అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపైనా దృష్టిపెట్టాలని ఆయన తెలిపారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి