Andhra News: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ఇక తాగి.. తూగడమే లేటు..!

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఆ నగరాల్లో ప్రీమియం లిక్కర్ స్టోర్స్‌కు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Andhra News: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ఇక తాగి.. తూగడమే లేటు..!
Premium Liquor Stores In Ap
Follow us
Eswar Chennupalli

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 12, 2024 | 6:55 AM

ఆరునెలల కిందట ఏర్పాటైన కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో మందుబాబుల కోసం తీసుకొచ్చిన మరో ప్రాజెక్టు ఇది. రాష్ట్రంలోని 12 ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటుకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంది.

ఈ లైసెన్సు జారీ విధానం

కాలపరిమితి: ఈ లైసెన్సులు ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయబడతాయి.

డిపాజిట్: లైసెన్సుకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ రూ. 15 లక్షలు.

లైసెన్సు ఫీజు: సంవత్సరానికి రూ. కోటి, ప్రతి ఏడాది 10% పెరుగుదల ఉంటుంది.

గెజిట్ నోటిఫికేషన్: విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన.

కార్పెట్ ఏరియా: కనీసం 4,000 స్క్వేర్ ఫీట్ ఉండాలి.

ఫ్లోర్ ప్లాన్: దరఖాస్తుతో పాటు ప్రాంగణానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ సమర్పణ తప్పనిసరి.

ఆర్థిక పత్రాలు: మూడేళ్ల ఐటీ రిటర్ని, బ్యాంకు అధికారుల ధ్రువీకరణతో కూడిన బ్యాంకుస్టేట్‌మెంట్లు, సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల పరిశీలన విధానం

మూస అభ్యర్ధనల పరిశీలన: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, సహాయ కమిషనర్, జిల్లా ఎక్సైజ్ అధికారులతో కూడిన కమిటీ ప్రతిపాదిత ప్రాంగణాల పరిశీలన చేస్తుంది.

ప్రయర్ క్లియరెన్స్: కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత, ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ముందస్తు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపుతారు

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ దరఖాస్తుల మదింపు నిర్వహిస్తుంది.

ఈ మదింపు ప్రక్రియలో ఐఐఎంలు, నిపుణుల సూచనలను తీసుకొని దరఖాస్తుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.

ముగింపు ప్రక్రియ: అన్ని పరిశీలనలు పూర్తి చేసిన తర్వాత, దరఖాస్తుదారులు 45 రోజులలోపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించాలి.

ఫైనల్ లైసెన్సు: నిబంధనల ప్రకారం అన్ని అంగీకారాలు పొందిన దరఖాస్తుదారులకు లైసెన్సు జారీ చేస్తారు.

ప్రత్యేకతలు

ట్రేడ్ మార్జిన్: మద్యం ఇష్యూ ప్రైస్ పై 20% ట్రేడ్ మార్జిన్ చెల్లింపు ఉండనున్నట్టు జీఓలో ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

నోటిఫికేషన్: ఏ నగరాల్లో ఎన్ని స్టోర్లు ఏర్పాటు చేయనున్నారో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

దరఖాస్తు సమర్పణ: నోటిఫికేషన్లో దరఖాస్తు సమర్పణ ప్రారంభ, ముగింపు తేదీలను ప్రకటిస్తారు.

అంతిమ లక్ష్యం: ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పారదర్శకత, అధునాతన మద్యం అందుబాటు వంటి అంశాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి