ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన ఏపీ ప్రభుత్వం.. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన ఉన్నత అధికారులపై కొరడా ఝులిపిస్తోంది. తాజాగా ఐపీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన ఉన్నత అధికారులపై కొరడా ఝులిపిస్తోంది. తాజాగా ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ నమోదు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మోపిన అభియోగాలకు సమాధానం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. రాజకీయ సిఫార్సులు, ప్రలోభాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి అందరికి తెలిసిందే.