గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ ప్రక్రియ షురూ..

గ్రామ వలంటీర్ల పోస్టులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈరోజు నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇంటర్వ్యూలు కండక్ట్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏదైనా మండలంలో 700కు పైగా దరఖాస్తులు వస్తే అక్కడ అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఇప్పటికే సూచించారు. తొలిరోజు ఒక్కో మండలంలో ఇంటర్వ్యూ బోర్డు 30 […]

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ ప్రక్రియ షురూ..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 1:14 PM

గ్రామ వలంటీర్ల పోస్టులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈరోజు నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇంటర్వ్యూలు కండక్ట్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏదైనా మండలంలో 700కు పైగా దరఖాస్తులు వస్తే అక్కడ అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఇప్పటికే సూచించారు. తొలిరోజు ఒక్కో మండలంలో ఇంటర్వ్యూ బోర్డు 30 మందికి, రెండో రోజు నుంచి రోజూ 60 మందికి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యనే ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు. మహిళా అభ్యర్థులు, దివ్యాంగులను మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30 గంటల మధ్య ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు ఫొటో ఐడీ, జెరాక్స్‌ కాఫీలు, సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు 30 నిమిషాల ముందుగా హాజరు కావాల్సి ఉంటుందని మండల స్థాయి అధికారులకు కమిషనర్‌ గిరిజాశంకర్‌ వివరించారు.

గ్రామ వలంటీర్ల ఎంపికలో భాగంగా 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని ఎంపిక చేస్తారు. రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు. ఒక గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వలంటీర్లందరికీ ఒకే రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూల్లో ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, జనరల్‌ అవేర్‌నెస్‌, యాటిట్యూడ్‌, సామాజిక బాధ్యత, సాంఘిక సమస్యలపై అవగాహన, స్థానిక సమస్యలపై అవగాహన, నాయకత్వ లక్షణాలు వంటి వాటిని పరిశీలిస్తారు.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?