Andhrapradesh: ‘జూలై చివరి వారంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు..’ సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్
టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి...
టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని గవర్నమెంట్ తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలు తీసేసుకున్నాయి. ఇంకా ఏపీ, కేరళ వంటి రాష్ట్రాలు మాత్రమే వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. దీనిపై సుప్రీం కోర్టులో ఇటీవల విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఇప్పటివరకూ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని అత్యున్నత న్యాయస్ధానం తప్పుబట్టింది. అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. విద్యార్దుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్ష హాల్లో 15 నుంచి 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇద్దరు విద్యార్ధుల మధ్య 5 ఆడుగుల భౌతిక దూరం పాటిస్తామన్నారు. అన్ని రకాలు కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నామని చెప్పారు. పదో తరగతి విద్యార్దులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనివల్ల మార్కుల ప్రాతిపదికన పోలిక ఉండదని తెలిపారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. కోర్టులో చెప్పిన విషయాలన్నీ… రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏఫీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
Also Read:‘పనిమనిషి ఉంటేనే ఇంట్లో ఉంటాను..’ భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన ప్రొఫెసర్