Sajjala: అమర్ రాజా బ్యాటరీ సంస్థ పోవడం కాదు.. ఏపీ ప్రభుత్వమే పొమ్మంటోందిః సజ్జల
ప్రముఖ బ్యాటరీ సంస్థ అమర్ రాజా సంస్థ ఏపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా వస్తున్నవార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
Sajjala Ramakrishna Reddy on Amar Raja: ప్రముఖ బ్యాటరీ సంస్థ అమర్ రాజా సంస్థ ఏపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా వస్తున్నవార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమర్ రాజా బాటరీ కంపెనీ వల్ల విష పదార్ధాలు వస్తున్నాయని రాష్ట్ర హైకోర్టు ధృవీకరించిందన్న ఆయన.. అమర్ రాజా సంస్థ పోవడం కాదు ప్రభుత్వమే పొమ్మంటోందని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు ఆందోళనలను ప్రజలు ఎవరూ గుర్తించరన్నారు. చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని.. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదని సజ్జల ధ్వజమెత్తారు. తాడేపల్లిలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే, బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థ అమర్ రాజా. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు ప్రస్తుతం ఆయనే డైరెక్టర్ గా ఉన్నారు. చిత్తూరు జిల్లా నుండే అన్ని కార్యకలాపాలను సాగించే ఈ కంపెనీలో బ్యాటరీలు, ఇన్వెర్టర్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కూడా సాగుతుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 15 వేలమందికి పైగా స్వయంగా ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ సంస్థ ఏడాదికి పన్నుల రూపంలో రూ.2400 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తంలో ఏపీకి రూ.1200 కోట్లు పన్ను వెళ్తుండగా మిగతాది కేంద్రానికి వెళ్తుంది. చిత్తూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలో ఈ సంస్థలో ఉపాధి దొరికేలా విద్యాసంస్థలు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.
అయితే, తాజాగా ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలి పోతున్నట్లుగా ఏపీ రాజకీయ, వ్యాపార వర్గాలలో వినిపిస్తుంది. కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం.. అమర్ రాజా సంస్థకు మధ్య పలు వివాదాలు జరుగుతున్నాయి. అవి రాజకీయ పరమైన కారణాలా లేక వ్యాపారం సంబంధ లావాదేవీల అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఈ సంస్థ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు వెళ్లేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరపగా.. స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. Read Also… Telangana: టార్గెట్ అధికారం.. ఆగస్టు అడ్డగా తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. ఆసక్తికర విశేషాలు మీకోసం..