Balaraju Goud |
Updated on: Aug 03, 2021 | 1:52 PM
ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడం చూశాం.. ఆంబులెన్స్ నడపడం చూశాం.. స్కూటర్ నడిపడం కూడా చూశాం.. మరి డప్పు కొడితే ఎలా ఉంటదో తెలుసా.. ఇదిగో ఇలాగే ఉంటది.
నగరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా డప్పు కొట్టి దరువేశారు. పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు.
72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర పరికరాలను ఎమ్మెల్యే రోజా అందచేశారు.
కళాకారులతో కలిసి తానే డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు ఎమ్మెల్యే రోజా. వారితో ఆడుతూ పాడుతూ ఉత్సాహ పరిచారు.
నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయకులు, ప్రజలు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు.