- Telugu News పొలిటికల్ ఫొటోలు Telangana cm kcr announced 150 crore funds to nagarjuna sagar constituency development
CM KCR on Sagar: నాగార్జున సాగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలజల్లు.. హాలియా పర్యటన చిత్రాలు
నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Updated on: Aug 02, 2021 | 2:31 PM

నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం కేసీఆర్ హాలియా మార్కెట్ యార్డులో సమీక్ష నిర్వహించారు. సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అంచెలంచెలుగా పరిష్కరిస్తానని సీఎం తెలిపారు.

నియోజకవర్గంలోని గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా సరిగా కల్వర్టులు లేవని సీఎం కేసీఆర్ చెప్పారు. హాస్పిటళ్ల పరిస్థితి కూడా బాగాలేదని చెప్పారు. హాలియా పట్టణాన్ని చూస్తేనే తమ సమస్య అర్థమవుతుందని చెప్పారు. హాలియాలోని రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. వాటన్నింటిని క్రమక్రమంగా పూర్తి చేసుకుందాం అని కేసీఆర్ అన్నారు.

త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. దీన్ని కూడా నెల్లికల్ లిఫ్ట్‌తో పాటు మంజూరు చేస్తామన్నారు. దేవరకొండలో ఐదు లిఫ్ట్‌లు మంజూరు చేశాం, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్‌లు, నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్‌తో పాటు ఈ జిల్లాకు మొత్తం 15 లిఫ్ట్‌లు మంజూరు చేయడం జరిగిందన్నారు. లిఫ్ట్‌లన్నింటినీ రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు.

నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌తో పాటు ఇరిగేషన్ భూముల్లో ఉన్నవారిని క్రమబద్దీకరిస్తాం. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ, హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. ఈ పని నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు. హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR

నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
