AP Corona Cases: ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా పాజిటివ్ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే.!
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,042 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,042 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,08,065 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 33,230 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 3748 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 18,61,937కి చేరింది. అలాగే తాజాగా వైరస్ కారణంగా 28 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 12,898కి చేరింది.
మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 91, చిత్తూరు 358, తూర్పుగోదావరి 665, గుంటూరు 277, కడప 79, కృష్ణ 252, కర్నూలు 51, నెల్లూరు 251, ప్రకాశం 310, శ్రీకాకుళం 116, విశాఖపట్నం 171, విజయనగరం 61, పశ్చిమ గోదావరి 360 కేసులు నమోదయ్యాయి.
ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..
ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఇంకా తగ్గని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. మరోవైపు మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. అలాగే రాత్రి 9 గంటలకు దుకాణాలను మూసివేయాలంది. ఈ సడలింపులు జూలై 7వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.