YSR Zero Interest Scheme: మహిళా సాధికారత మా నినాదం కాదు.. విధానం.. ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ నగదు జమ చేసిన సీఎం జగన్..
YSR Sunna Vaddi Pathakam: మహిళా సాధికారత తమ నినాదం కాదని.. విధానం.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదుపు సంఘాల

YSR Sunna Vaddi Pathakam: మహిళా సాధికారత తమ నినాదం కాదని.. విధానం.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ జమతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తూన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వరుసగా రెండో ఏడాది కూడా శుక్రవారం చెల్లించింది. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆన్‌లైన్ ద్వారా మహిళల బ్యాంకు ఖాతాల్లో వడ్డీ నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు ప్రభుత్వం తరుపున అండగా నిలబడ్డామని పేర్కొన్నారు.
మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నాం.. ఇలా మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగామని జగన్ పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని.. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నట్లు వెల్లడించారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామన్నారు. అక్కాచెల్లెమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని.. మహిళా సాధికారత తమ నినాదం కాదని.. తమ విధానం అంటూ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా.. మహిళలకు 50 శాతం నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామన్నారు.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Ys Jagan Released Ysr Zero Interest
Also Read:
