Police: నా గర్ల్ ఫ్రెండ్ ను మిస్ అవుతున్నాను..ఎలా కలుసుకోవాలి అంటూ ట్వీట్.. దానికి పోలీసుల సమాధానం చూసి నెటిజన్లు ఫిదా!
ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం నుంచి COVID-19 ఆంక్షలను ప్రకటించడం వరకు, ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరిస్తారు. వారు నెటిజన్లకు ఫన్నీ జవాబులు ఇస్తూనే వారికి విషయం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటారు.
Police: ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం నుంచి COVID-19 ఆంక్షలను ప్రకటించడం వరకు, ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరిస్తారు. వారు నెటిజన్లకు ఫన్నీ జవాబులు ఇస్తూనే వారికి విషయం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటారు. అందుకే ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో మంచి ప్రాచుర్యం సాధించారు. అందుకు తాజాగా ట్విట్టర్ లో వారు ఒక యువకునికి ఇచ్చిన సమాధానమే నిదర్శనం. ప్రస్తుతం ముంబయిలో కోవిడ్ తొ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ లాక్ డౌన్ విధించారు. కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ నేపధ్యంలో గురువారం అశ్విన్ వినోద్ అనే ఓ యువకుడు ముంబయి పోలీసులకు ఓ అభ్యర్దన చేశాడు.
” నా గర్ల్ ఫ్రెండ్ ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆమెను మిస్ అవుతున్నాను. అందుకే, బయటకు వెళ్లి ఆమెను కలవడానికి నేను నా వాహనానికి ఏ స్టిక్కర్ ఉపయోగించాలి?” అంటూ ప్రశ్నించాడు.
ఈ ట్వీట్‌పై స్పందించిన ముంబయి పోలీసులు, “ఇది మీకు చాలా అవసరం అని మేము అర్థం చేసుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు ఇది మా నిత్యావసరాలు లేదా అత్యవసర వర్గాల పరిధిలోకి రాదు! దూరం హృదయాన్ని బాగా విశాలం చేస్తుంది. మీరు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలానే ఉండండి.” అంటూ చెప్పారు. అంతే కాదు “మేము మీ ఇద్దరూ కలిసి జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాము. అందులో ఇది ఒక దశ మాత్రమే.” అంటూ ముక్తాయించారు.
దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి ట్విట్టర్ లో చాలా మంది స్పందించారు అందరూ, ముంబయి పోలీసులు ఇచ్చిన వేగవంతమైన, సున్నితమైన సమాధానం ఇచ్చినందుకు తెగ మెచ్చుకుంటున్నారు. ముంబయి పోలీసుల ట్వీట్ ఇదీ..
We understand it’s essential for you sir but unfortunately it doesn’t fall under our essentials or emergency categories!
Distance makes the heart grow fonder & currently, you healthier
P.S. We wish you lifetime together. This is just a phase. #StayHomeStaySafe https://t.co/5221kRAmHp
— Mumbai Police (@MumbaiPolice) April 22, 2021
నటుడు హర్షవర్ధన్ రాణే ఈ సంభాషణను రీట్వీట్ చేసి, “చాలా తీపి” అని రాశారు.
So sweet ♥️ https://t.co/bfDy8hrc3X
— Harshvardhan Rane (@harsha_actor) April 22, 2021
వారి శ్రద్ధకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఒక నెటిజన్ ఇలా అన్నారు, ” ఈ సమయంలో చాలా శ్రద్ధగా సమాధానం ఇచ్చారు. మీ సేవకు ఎప్పటికీ కృతజ్ఞులం..”
Very thoughtful reply in these trying times. Each person has their own essentials. Please keep us engaged with witty responses and we are forever grateful for your service! You take care of Mumbai like no one else does! All of you stay safe and healthy!??
— Satyan Israni (@MurgMakhaniRox) April 22, 2021
ఈ కఠినమైన సమయాల్లో డిపార్ట్మెంట్ యొక్క హాస్య భావనను మరొక నెటిజన్ ప్రశంసించారు. అతను , “హహ్హాహా బ్రిలియంట్ రిప్లై! ముంబై పోలీసుల అద్భుతమై హాస్యం!” అని రాశారు.
Hahhahaha Brilliant Reply ! Kudos to Mumbai police and the excellent sense of humour !!!?
— Ronakk Kanti Rughani (@RonakRughani1) April 22, 2021
ఈ పరిస్థితికి మీదే బాధ్యత’, ఆక్సిజన్ కొరత, రోగుల మృతిపై కేంద్రాన్ని దుయ్యబట్టిన రాహుల్ గాంధీ