YS Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. ఇదే చివరి అవకాశమన్న సీబీఐ కోర్టు
AP CM YS Jagan CBI bail case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ధర్మాసనం ఈ కేసు విచారణను
AP CM YS Jagan CBI bail case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ధర్మాసనం ఈ కేసు విచారణను జూన్ 1 కి వాయిదా వేసింది. అయితే.. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఉదయం విచారణ జరిగింది. లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతోపాటు సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని.. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 1 వ తేదీ వరకు ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: