Ravi Kiran |
Updated on: May 26, 2021 | 9:53 AM
టీమ్ ఇండియాకు చెందిన మొత్తం 24 మంది ఆటగాళ్ళు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. వీరితో కామెంటరీ పానెల్ కింద మరో ఇద్దరు భారత ప్లేయర్స్ కూడా ఇంగ్లాండ్ పయనం కానున్నారు. ఈ ప్లేయర్స్‌లో కొంతమందికి పెళ్లి కాగా.. వారి సతీమణులు కూడా ఆటగాళ్ళే. ఆ వివరాలు..
ఇషాంత్ శర్మ. టీమిండియా పేస్ ఎటాక్‌లో అత్యంత అనుభవజ్ఞుడు. ఇతడు భారత బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రతిమా సింగ్ 2006,07, 09 సంవత్సరాల్లో ఆసియా బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
దినేష్ కార్తీక్. భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యాతగా ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. దినేష్ కార్తీక్ భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను 2015 లో వివాహం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2014లో జోపన్ చైనప్పతో పాటు దీపిక కూడా స్వర్ణం సాధించింది. దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్క్వాష్‌లో దేశానికి రెండు రజత పతకాలు సాధించారు.