AP CM Jagan: క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్.. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి
AP CM Jagan: క్రీస్తు పుట్టిన రోజు క్రిస్మస్ సందర్భంగా దేశ విదేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా..
AP CM Jagan: క్రీస్తు పుట్టిన రోజు క్రిస్మస్ సందర్భంగా దేశ విదేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేశారు. సీఎం జగన్ ఫ్యామిలీ సన్నిహితుల మధ్య కేక్ కట్ చేసి.. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సీఎం జగన్ ఇడుపుల పాయ హెలిప్యాడ్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. అనంతరం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పా టు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
చర్చిలో జరిగే ప్రార్థనల్లో సీఎం జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్టు నుంచి సీఎం జగన్ విజయవాడకు తిరిగి చేరుకోనున్నారు.
Also Read: ఓవెన్ అవసరం లేకుండా ఓరియో బిస్కట్స్‌తో రుచికరమైన ఎగ్‌లెస్ కేక్.. రెసిపీ.. మీ కోసం..