AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మరోసారి ఢిల్లీకి సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ టూర్‌ వెళ్లనున్నారు. బుధవారం (మార్చి 29) జగన్‌ ఢిల్లీ బయలు దేరనున్నారు. ఈ నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌ వెళ్లడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే సోమవారం..

CM Jagan: మరోసారి ఢిల్లీకి సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా.
CM Jagan Delhi Tour (File Photo)
Narender Vaitla
|

Updated on: Mar 28, 2023 | 3:11 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ టూర్‌ వెళ్లనున్నారు. బుధవారం (మార్చి 29) జగన్‌ ఢిల్లీ బయలు దేరనున్నారు. ఈ నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌ వెళ్లడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే సోమవారం జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. గవర్నర్‌తో భేటీ వెంటనే సీఎమ్‌ ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే ఈ నెల 17వ తేదీన సీఎమ్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రధానితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చేపట్టనున్న పర్యటనలోనూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నట్లు సమాచారం. ప్రధానితో పాటు.. పలుశాఖల మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా జగన్‌ మోహన్‌ రెడ్డి ఈరోజు (మంగళవారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. జీ20 సదస్సులో పాల్గొననున్నారు.. సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్న సీఎం.. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రసగించనున్నారు. అనంతరం రాత్రి తాడేపల్లికి చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..