AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరైన..

జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న బీఆర్‌ఎస్‌ ఏపీలో పార్టీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ (మే21) గుంటూరులో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆఫీసును ప్రారంభించింది. మొత్తం 5 అంతస్తుల భవనాన్ని ఏపీ బీఆర్‌ఎస్‌ చీఫ్‌ తోట చంద్రశేఖర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు.

Andhra Pradesh: ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరైన..
Ap Brs State Office
Basha Shek
|

Updated on: May 21, 2023 | 12:12 PM

Share

జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న బీఆర్‌ఎస్‌ ఏపీలో పార్టీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ (మే21) గుంటూరులో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆఫీసును ప్రారంభించింది. మొత్తం 5 అంతస్తుల భవనాన్ని ఏపీ బీఆర్‌ఎస్‌ చీఫ్‌ తోట చంద్రశేఖర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పలు జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు భారీగా తరలివచ్చారు. దీంతో గుంటూరు నగరం సందడి సందడిగా మారింది. కాగా మొత్తం 5 అంతస్థుల భవనంలో మొదటి అంతస్థులో కార్యకర్తలతో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు మూడు అంతస్థుల్లో పరిపాలన విభాగాలను సిద్ధం చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అతిధులు కూర్చోనే విధంగా విశాలమైన స్థలంలో హాలు ఏర్పాటు చేశారు. కాగా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయని ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా వెళుతోంది. అక్కడ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇక తర్వాత మధ్యప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టే యోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలోనూ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..