Guntur: మిస్టర్ ఎస్సై మీరే ఇలా చేస్తే ఎలా.. ప్రేమంటూ దగ్గరై.. పెళ్లి అనేసరికి

ఎస్సై రవితేజ ఏడాదిన్నరగా ప్రేమిస్తున్నానని చెప్పి.. అతడు నివాసముంటున్న అపార్ట్‌మెంటుకు పలుమార్లు తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యువతి నర్సుగా పనిచేస్తోంది. పెళ్లి చేసుకోవాలని కోరితే ఎస్సై మోహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

Guntur: మిస్టర్ ఎస్సై మీరే ఇలా చేస్తే ఎలా.. ప్రేమంటూ దగ్గరై.. పెళ్లి అనేసరికి
SI Ravi Teja Cheating
Follow us

|

Updated on: May 21, 2023 | 1:05 PM

గుంటూరు జిల్లా నగరపాలెం ఎస్సై రవితేజపై అట్రాసిటీ, రేప్ కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత యువతి ఫిర్యాదు.. కేసు నమోదు చేశారన్న సమాచారంతో ఎస్సై రవితేజ పత్తా లేకుండా పోయాడు. పరారీలో ఉన్న ఎస్సై కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రేమ పేరుతో దగ్గరైన రవితేజ.. బాధిత యువతితో కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగాడు. అయితే మూడుముళ్ల మాటెత్తేసరికి హ్యాండిచ్చాడని ఆరోపించింది బాధిత యువతి. తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది.

రవితేజకు తనకు చాలాకాలంగా ప్రేమాయణం సాగిందని.. అందుకు సంబంధించిన వీడియోలే సాక్ష్యమంటూ వాటిని రిలీజ్ చేసింది. అంతకంటే ముందు తనకు రవితేజతో పెళ్లి జరిపించాలంటూ పీఎస్‌లో ఆందోళనకు దిగింది. బాధిత యువతికి స్తానిక మహిళలు కూడా మద్దతు పలికారు. ఆమెకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు.. రవితేజ కోసం గాలిస్తున్నామన్నారు.

గతంలో మరొకరితో ప్రేమ వ్యవహారం ఉందని.. పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది బాధిత యువతి. అదే విషయం ప్రశ్నిస్తే ఇప్పుడేం అడగొద్దని విఙ్ఞప్తి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..