Daggubati Purandeswari: సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. టీడీపీ బంద్‌కు మద్దతుపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి క్లారిటీ..
Andhra Pradesh BJP: స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత హీటెక్కించింది. చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన అనంతరం.. రెండు రోజులుగా జరిగిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపాయి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ భగ్గుమంది.. ఏపీ బంద్‌కు పిలునిచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఇచ్చిన బంద్‌కు జనసేన మద్దతు ప్రకటించింది.
Andhra Pradesh BJP: స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత హీటెక్కించింది. చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన అనంతరం.. రెండు రోజులుగా జరిగిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపాయి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ భగ్గుమంది.. ఏపీ బంద్‌కు పిలునిచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఇచ్చిన బంద్‌కు జనసేన మద్దతు ప్రకటించింది. అయితే, తెలుగుదేశం బంద్‌కు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించినట్లు మొదట ప్రచారం జరిగింది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేరిట పార్టీ లెటర్ హెడర్ తో ఫేక్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన తరువాత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. బీజేపీ కూడా మద్దతు ప్రకటించినట్లు వాట్సప్ గ్రూపులల్లో, అదేవిధంగా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫాంలలో బాగా వైరల్ అయింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. మద్దతు తెలిపినట్లు ప్రచారం అవుతున్న ఆ లెటర్ హెడ్ ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్టుగా.. బీజేపీ లెటర్ హెడ్ పై తన సంతకంతో ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోందంటూ పురంధేశ్వరి వెల్లడించారు. ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ మేరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.
కాగా.. బీజేపీ మద్దతునిచ్చినట్లు ఫేక్ ప్రచారం చేయడం వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రకటన అనంతరం.. టీడీపీ బంద్ కు ఆ పార్టీ మద్దతు తెలపకపోవడం గురించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ లో చేసిన పోస్ట్ ఇదే..
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రేపటి బంద్ పిలుపుకు మద్దతు ఇచ్చినట్లుగా ఒక బిజెపి లెటర్ హెడ్ పై నేను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్స్ ప్ గ్రూప్ లలో సర్క్యులేట్ అవుతోంది.
ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్ కు కారకుల పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేస్తాము. -… pic.twitter.com/1mkWAi8v2P
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) September 10, 2023
ఇదిలాఉంటే.. ఏపీలో బంద్ కొనసాగుతోంది. టీడీపీ ఇచ్చిన బంద్ కు జనసేన, ఎమ్మార్పీఎస్ మద్దతునిచ్చాయి. పలు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..