Teacher: మాయదారి గుండెపోటుకు మాస్టారు బలి.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిన మాస్టారు.

Teacher: మాయదారి గుండెపోటుకు మాస్టారు బలి.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిన మాస్టారు.

Anil kumar poka

|

Updated on: Sep 11, 2023 | 9:12 AM

ఇటీవలే మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా భార్యభర్తలిద్దరూ ఎంపకయ్యారు. పెద్ద ఎత్తున ప్రశంసలు సత్కారాలు అందుకున్నారు. ఆ అవార్డు అందుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు ఆ మాస్టారు. క్లాసులో పిల్లలకు పాఠాలు చెబుతూనే కుప్పకూలిపోయారు. అచేతనంగా పడిఉన్న తమ మాస్టారిని చూసి విద్యార్ధులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

ఇటీవలే మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా భార్యభర్తలిద్దరూ ఎంపకయ్యారు. పెద్ద ఎత్తున ప్రశంసలు సత్కారాలు అందుకున్నారు. ఆ అవార్డు అందుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు ఆ మాస్టారు. క్లాసులో పిల్లలకు పాఠాలు చెబుతూనే కుప్పకూలిపోయారు. అచేతనంగా పడిఉన్న తమ మాస్టారిని చూసి విద్యార్ధులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పెదబయలు మండలం చిడిపుట్టు ఎంపీపీ ఎస్ పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు లలిత్‌ శంకర్‌ పిల్లలకు పాఠాలు చెప్తూ, బోర్డ్ పై ఏదో రాసి వివరిస్తున్న ఆయన ఒక్కసారిగా కుర్చీ లో కూలబడి పోయారు. విద్యార్థులకు కాసేపు ఏం జరుగుతుందో అర్దం కాలేదు. ఆరోగ్యం బాలేక కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారేమో అనుకున్నారు. మాస్టారిని పిలిచినా పలకలేదు.. దాంతో భయపడిన విద్యార్థులు పక్క తరగతి గదిలో పాఠాలు చెబుతున్న మరో మాస్టారుకి విషయం చెప్పారు. వెంటనే ఆయక అక్కడికి చేరుకొని తమ ప్రధానోపాధ్యాయుడిని చూసి గుండెపోటుకు గురయ్యారని భావించి సీపీఆర్‌ చేసారు. అయినా మాస్టారిలో చలనం లేకపోవడంతో 108లో ఆస్పత్రికి తరలించారు. లలిత్‌ శంకర్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మాస్టారు మృతి చెందినట్టు చెప్పారు. లలిత్ శంకర్ వయసు 50 సంవత్సరాలు. ఆయన సతీమణి కూడా సీకరి పాఠశాల లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో పాఠశాలలో చదివే ప్రతి విద్యార్ధిని తమ పిల్లల్లా భావించారు లలిత్‌ శంకర్‌. వారికి విద్యాబుద్దులు నేర్పడం మాత్రమే కాదు, ఆర్ధిక పరిస్థితి బాలేని పిల్లల కుటుంబాలకు సహాయం చేసేవారు ఆ దంపతులు. దీంతో ఆ దంపతులంటే ఏజెన్సీ లో అందరికీ ఓ ప్రత్యేకమైన గౌరవం. ఇటీవలే ఆగస్ట్ 15 సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికయ్యారు. దాంతో పెద్ద ఎత్తున ప్రశంసలు, సత్కారాలు కూడా లభించాయి. అంతలోపే లలిత్ శంకర్ మరణించారన్న వార్త అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..