Weather Alert: తెలుగు రాష్ట్రాలకు మరికొన్ని రోజుల పాటు వర్షాలు.. ఇదిగో వివరాలు
రెండు తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఎందుకంటే.. అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికల్లా వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈశాన్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతున్న ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
రెండు తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఎందుకంటే.. అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికల్లా వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈశాన్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతున్న ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఏపీలో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 14వరకు ఉభయ తెలుగు రాష్ట్రలకు వర్ష సూచన ఉన్నట్టు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తన తాజా వెదర్ బుల్లెటిన్ లో పేర్కొంది.
కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వర్షాలు కురిసేందుకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో చిరుజల్లులతోపాటు మోస్తారు వర్షాలు పడుతున్నాయి. రేపటికి బంగాళాఖాతంలో మరో ఉపర్తల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాలో చాలాచోట్లా, దక్షిణకొస్తా జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం అక్కడ తీరం వెంట గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచనలు చేస్తోంది భారత వాతావరణ శాఖ. ఈనెల 14 వరకు ఈ సూచనలు పాటించాలని ప్రకటించింది. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణలో కూడా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్ల హైదరాబాద్ వాతారవరణ కేంద్రం పేర్కొంది.