AP: యూరప్ ఎక్స్‌పో 2022లో ఏపీకి భారీ ఇన్వెస్ట్‌మెంట్‌.. రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 టాప్ గ్లోబల్ కంపెనీలు

AP: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టుల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు 11 భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC)లో..

AP: యూరప్ ఎక్స్‌పో 2022లో ఏపీకి భారీ ఇన్వెస్ట్‌మెంట్‌.. రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 టాప్ గ్లోబల్ కంపెనీలు
Visakhapatnam
Follow us
Subhash Goud

|

Updated on: Sep 25, 2022 | 2:25 PM

AP: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టుల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు 11 భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC)లో 550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ప్రకటించాయని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ను రిక్రియేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చొరవలో ఈ కంపెనీలు భాగం కానున్నాయని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిటిడిసి) చైర్మన్ ఎ. వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. సెప్టెంబరు 12 నుండి 15 వరకు లండన్‌లో జరిగిన యూరప్‌ ఎక్స్‌పో 2022 జరిగింది. ఇందులో పాల్గొన్న వరప్రసాద్ రెడ్డి ఇప్పుడే ఏపీకి తిరిగి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 11 ప్రముఖ కంపెనీలు వివిధ టూరిజం ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వైఎస్సార్‌ సీపీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

వివిధ సంస్థల ప్రతినిధులతో తాను సమావేశమై, పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలను, ఏపీ నూతన పర్యాటక విధానంలో పెట్టుబడిదారులకు అందించిన ప్రోత్సాహకాలు, మద్దతు, భూమి లభ్యత గురించి వారికి వివరించినట్లు తెలిపింది. పర్యాటక ప్రాజెక్టుల కోసం రాష్ట్రంలోని బ్యాంకులు, సముద్ర తీరం వివరాలు, సుందరమైన, మతపరమైన, చారిత్రక ప్రదేశాలు, సీఎం వైఎస్‌ జగన్‌ పాలన గురించి వివరించినట్లు ప్రకటనలో వరప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు మేరకు వైఎస్సార్‌ సీపీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పర్యాటక వృద్ధిలో భాగం కావాలని వారిని రాష్ట్రం ఆహ్వానించినట్లు తెలిపింది. విదేశీ కంపెనీల ద్వారా ప్రత్యక్ష పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, కన్సార్టియంల ద్వారా పెట్టుబడులు, సాంకేతికత బదిలీ ద్వారా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు పరికరాలను సరఫరా చేయడం, ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ నిపుణులచే శిక్షణ ఇవ్వడం వంటివి ఉన్నాయని వరప్రసాద్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తాను ఎక్స్‌పోలో పాల్గొన్నట్లు చెప్పారు. అన్ని కంపెనీలను సంప్రదించి రాష్ట్రంలో ఉన్న వనరులను, టూరిజం పాలసీ గురించి వివరించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్న టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకువచ్చేలా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. టర్కికి చెందిన పోలిన గ్రూప్‌ లాంటి 11 పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి విముఖత వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

అమ్యూజ్‌మెంట్ రైడ్‌లు, మోనోరైళ్ల తయారీలో అగ్రగామిగా ఉన్న స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటామిన్ వరల్డ్‌వైడ్ ప్రతినిధులను తాను కలిశానని చెప్పారు. ఈ సంస్థ రూ.100 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో ప్రతిపాదించబడిన స్కై టవర్ ప్రాజెక్ట్‌లో భాగం అవుతుందని అన్నారు.

తిరుపతిలో మోనోరైల్ ప్రాజెక్ట్ గురించి చర్చించడంతోపాటు, జాయింట్ వెంచర్‌గా రూ.100 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలోని స్కై టవర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టాలనుని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్ ఈ రూ.100 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం ప్రాజెక్ట్‌లో భాగం అవుతుందన్నారు. జర్మనీ ఆధారిత హస్ పార్క్ అట్రాక్షన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వినోదం, ఉద్యానవనాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. అలాగే అరకులోయలో ఒకేసారి 30 మందిని మోసే టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్ట్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఏరోఫైల్ సిద్ధంగా ఉందన్నారు.

యూరప్‌ ఎక్స్‌పో 2022లో జరిగిన పలు అంశాల గురించి ప్రకటన  విడుదల చేసిన వైసీపీ

☛ గండికోటలో స్కై-డైవింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా కెనడాకు చెందిన ఏరోడియం తన సమ్మతిని ఇచ్చింది.

☛  ఇటలీకి చెందిన NevePlast శీతాకాలపు క్రీడల కోసం పరికరాలను అందించడానికి అంగీకరించింది.

☛ Xtremeventures of France రాష్ట్రంలో ప్రపంచ స్థాయి అడ్వెంచర్ పార్క్ పట్ల ఆసక్తిని కనబరిచింది.

☛ డీఓఎఫ్‌ ఆఫ్ టర్కీ ఫ్లయింగ్ థియేటర్‌లు, హై-ఎండ్ మీడియా-ఆధారిత సిమ్యులేటర్‌ల విభాగంలో డోమ్ థియేటర్‌లను నిర్మించడానికి సిద్ధంగా ఉంది.

☛ కెనడాకు చెందిన వైట్ వాటర్ వెస్ట్ భారీ వాటర్ పార్క్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

☛ స్విట్జర్లాండ్‌కు చెందిన మరో కంపెనీ కైలాసగిరి కొండలపై తెలుగు మ్యూజియంతో సహా వివిధ ప్రాజెక్టులను విశాఖపట్నంకు తీసుకురావడానికి ఆసక్తిగా ఉంది.

☛ ఫ్రాన్స్‌కు చెందిన కాన్సెప్ట్, న్యూజిలాండ్‌కు చెందిన డెల్టా స్ట్రైక్ వంటి ఇతర కంపెనీలు అభివృద్ధి ప్రణాళికల్లో భాగం కావడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.