AP Assembly: డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రివిలేజ్ నోటీసులు.. నారాయణ స్వామి ఏమన్నారంటే..?
Narayana Swamy Comments on Nara Lokesh: నారా లోకేష్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ సీఎంపై మండలి
Narayana Swamy Comments on Nara Lokesh: నారా లోకేష్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ సీఎంపై మండలి చైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసిచ్చారు. నారా లోకేశ్‌ను నారాయణస్వామి అసెంబ్లీలో దూషించారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. మండలి నియమావళి రూల్ 173 ప్రకారం చైర్మన్‌ను ప్రివిలేజ్ నోటీసిచ్చారు. నిబంధనలకు తిలోదకాలిచ్చారని నోటీసులో ఆరోపించారు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. కాగా.. నారా లోకేష్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత కామెంట్లు చేయలేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి తనతో మాట్లాడారని.. ఆ వ్యక్తిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్లని తనను ఉద్దేశించినట్టుగా లోకేష్ భావిస్తున్నారని నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. కాగా.. సభలో నారా లోకేష్‌ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అసభ్యకరంగా మాట్లాడారు. దీనిపై ఆయన మంగళవారం మధ్యాహ్నం క్లారిటీ ఇచ్చారు. సభలో అలాంటి కామెంట్లు చేయకూడదు.. ఈ విషయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ పేర్కొన్నారు. తనను ఏ స్థాయిలో రెచ్చగొడితే అలా మాట్లాడానో గమనించాలని సూచించారు. బడుగులకు న్యాయం చేస్తోన్న ప్రభుత్వాన్ని కూలగొడతామంటే కోపం రాదా..? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ను వాడూ వీడూ అని ఇష్టానుసారంగా లోకేష్ మాట్లాడుతున్నారన్నారు. మద్యం నిషేధం.. మద్య నియంత్రణ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. యనమల వియ్యంకుడుకు.. అయ్యన్నపాత్రుడు వంటి వారు మద్యం డిస్టలరీలు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలే అయ్యన్నపాత్రుడు తన డిస్టలరీలను అమ్ముకున్నారంటూ విమర్శించారు. ఎస్సీలను చులకనగా చూసేది చంద్రబాబేనన్నారు.
మైనార్టీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేశారని.. చంద్రబాబు, లోకేష్ వంటి వారు అబద్దాల్లో పెరిగి.. అబద్దాలతోనే రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఔరంగజేబు కోవకు చెందిన వారంటూ విమర్శించారు. చంద్రబాబు ఏనాడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబులో ఇంకా మార్పు రాలేదన్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లకూ సంక్షేమ పథకాల లబ్ధి జరుగుతోందని.. జగన్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదని ప్రకటించారు. జగన్ పరిపాలన రామరాజ్యాన్ని తలపిస్తోందంటూ నారాయణస్వామి పేర్కొన్నారు. ఖరీదైన మద్యాన్ని 10-15 ఏళ్లపాటు తాగితే.. శరీరంలో ఆల్కహాల్ ఉంటుందని.. తాగుడుకు అలవాటు పడిన వాళ్ల ఆరోగ్యం సరిగా ఉండదంటూ నారాయణ స్వామి పేర్కొన్నారు.
Also Read:
YS Jagan: వైఎస్ఆర్‌కు పోలవరం అంకితం.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
Also Read: Fact Check: ఏపీ ప్రజలకు వైఎస్ భారతి లేఖ రాశారా..? ఇందులో నిజమెంత..
Milk Side Effects: ఈ వ్యక్తులు అస్సలు పాలు తాగకూడదు.. పాలు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసుకోండి..