YS Jagan: వైఎస్ఆర్‌కు పోలవరం అంకితం.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
CM YS Jagan on Polavaram Project: నవ్యాంధ్ర జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు మానవ తప్పిదం చేశారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో
CM YS Jagan on Polavaram Project: నవ్యాంధ్ర జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు మానవ తప్పిదం చేశారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏంటో చెప్తూనే.. అనేక సందేహాలకు అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు సీఎం జగన్. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. మంచిచేశానని చెప్పుకోడానికి ఆయనకి ఒక్కటీ లేదంటూ విమర్శించారు. పోలవరం పూర్తవుతోందంటే బాబుకి కడుపుమంటగా ఉందన్నారు. బాబుకి ప్లానింగ్ లేదు.. పద్ధతి లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరానికి బాబు పనులే శాపంగా మారాయని.. స్పిల్‌వే కట్టడంలో బాబుది అతిపెద్ద మానవ తప్పిదం అంటూ మండిపడ్డారు. స్పిల్‌వే పూర్తిచేయకుండానే కాఫర్‌డ్యామ్స్ కట్టారన్నారు. స్పిల్‌వే పూర్తిచేయలేదు, కాఫర్‌డ్యామ్ మధ్యలోనే ఆపేశారని పేర్కొన్నారు.
పోలవరం ఎత్తు ఒక్క ఇంచ్ కూడా తగ్గదని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వల్లే పోలవరానికి ఈ గతి పట్టిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కాదు.. చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారంటూ జగన్ ఎద్దెవా చేశారు. చంద్రబాబు హయాంలోనే నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదంటూ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం స్పష్టంచేశారు.
2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం స్పష్టంచేశారు. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని.. కేంద్రం సహకారంతో ఆర్‌అండ్‌ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు (వైఎస్ రాజశేఖర్ రెడ్డికి) అంకితం చేస్తామని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేసి తీరుతానని సీఎం వైఎస్ జగన్ సభలో పేర్కొన్నారు.
దివంగత మహానేత వైఎస్సార్ కొడుకుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను- సీఎం వైయస్ జగన్#APAssembly #CMYSJagan pic.twitter.com/yMW8P19hah
— YSR Congress Party (@YSRCParty) March 22, 2022
Also Read: