AP Elections 2024 Counting: ఏపీలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే.. తొలి ట్రెండ్స్ ఇలా

ఆంధ్రప్రదేశ్‌ ట్రెండ్స్‌పై నరాలుతెగే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలను లెక్కించనున్నారు కౌంటింగ్ అధికారులు. లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో తొలి ఫలితం విడుదలైంది.

AP Elections 2024 Counting: ఏపీలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే.. తొలి ట్రెండ్స్ ఇలా
Ys Jagan Chandrababu
Follow us
Srikar T

|

Updated on: Jun 04, 2024 | 9:13 AM

ఆంధ్రప్రదేశ్‌ ట్రెండ్స్‌పై నరాలుతెగే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలను లెక్కించనున్నారు కౌంటింగ్ అధికారులు. లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో తొలి ఫలితం విడుదలైంది. పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి కాస్త ఆధిక్యం తగ్గింది. బీజేపీ,టీడీపీ,జనసేన కూటమికి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవీఎం తొలి రౌండులో 91 ఓట్ల ఆధిక్యంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు.

తొలిరౌండ్లోనే వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకపడ్డారు. పోస్టల్ బ్యాలెట్లో మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ 1000 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 617 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1500 ఓట్ల లీడ్లో ఉన్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మధుర్ మండపేట 2700 ఓట్లు మెజారిటీతో కొనసాగుతున్నారు. జగ్గంపేట తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా తెనాలిలో లీడ్ లో కొనసాగుతున్నారు. బిజెపి అభ్యర్థి పురంధరేశ్వరి 7,498 లీడ్లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. మిగిలిన 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లలో పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. ఇక 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ లను లెక్కించనున్నారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోనే ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఏపీ లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!