AP Assembly Session 2024: ఈనెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఫిబ్రవరి 6న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి ఐదోవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు సర్వ అస్త్రాలతో సిద్దమువుతున్నారు.

AP Assembly Session 2024: ఈనెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఫిబ్రవరి 6న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌!
Tdlp Meeting
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 03, 2024 | 2:33 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి ఐదోవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు సర్వ అస్త్రాలతో సిద్దమువుతున్నారు.

ఐదోవ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై BAC లో నిర్ణయం తీసుకోనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో సమావేశాలు మూడు రోజులు మాత్రమే జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ కూడా అవసరం లేదని, ఈనేపథ్యంలోనే ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, అదే రోజు ఆమోదించడం చేసే ఆలోచనలో వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఆరోవ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. అదే రోజు లేదా ఏడోవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలిసింది. అయితే, ఖచ్చితంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేది బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధం అవుతుంది.

టీడీపీ శాసనసభాపక్ష సమావేశం

అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి ఐదో తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో ఆదివారం తెలుగుదేశం శాసనసభా పక్షం సమావేశం కావాలని భావిస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీలో లెవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే వైసీపీ నుంచి తెలుగుదేశం, అటు నుంచి ఈ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు విషయంలో అనర్హత వేటు వేసే అంశం కీలక దశకు చేరుకుంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ ని వ్యక్తిగతంగా కలిసి వివరణ కూడా ఇచ్చారు. అటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కారణాలతోనే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. స్పీకర్ తీరును సభలో ప్రస్తావించాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని అంశాల్ని సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది..ఇక, రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి ని బరిలోకి దింపడంపైనా ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…