Political Retaliatory: పల్నాడులో విచిత్ర పరిస్థితులు.. తెల్లవారేసరికి కాలి బూడిదైన వాహనాలు
ఇంటి ముందు పార్క్ చేసిన వాహనమేదైనా తెల్లవారేసరికి కాలి బూడిదైపోతుంది. గత కొంతకాలంగా పల్నాడు రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస వెంట జరుగుతున్న ఘటనలతో స్థానికులు బెంబెలెత్తి పోతున్నారు. రాజకీయ పార్టీ మధ్య విబేధాలతో వాహనాలు తగలబడుతున్నాయి. జీవనోపాధి కోల్పోతున్న బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి ముందు పార్క్ చేసిన వాహనమేదైనా తెల్లవారేసరికి కాలి బూడిదైపోతుంది. గత కొంతకాలంగా పల్నాడు రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస వెంట జరుగుతున్న ఘటనలతో స్థానికులు బెంబెలెత్తి పోతున్నారు. రాజకీయ పార్టీ మధ్య విబేధాలతో వాహనాలు తగలబడుతున్నాయి. జీవనోపాధి కోల్పోతున్న బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పాదం రాంబాబు తన బైక్ ను ఎప్పటి లాగే ఇంటి ముందు పార్క్ చేసుకున్నాడు. రాత్రి సమయంలో ఇంటి కుటుంబ సభ్యులతో కలిసి నిద్ర పోయాడు. తెల్లవారి లేచి చూసే సరికి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ పూర్తిగా కాలిపోయి కనిపించింది. కనీసం మంటలు గమనించి కూడా చుట్టు పక్కల వాళ్లు నిద్ర కూడా లేపలేదు. అయితే పాదం రాంబాబు బైక్ ఎవరూ తగుల బెట్టారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, రాజకీయ కక్షల్లో భాగంగానే తన బైక్ తగుల బెట్టారని రాంబాబు భావిస్తున్నాడు. అంతక ముందు రోజే మాచర్లలో జరిగిన టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశానికి రాంబాబు వెళ్లి వచ్చాడు. ఆ మరుసటి రోజే ద్విచక్ర వాహానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు.
ఈ ఘటన మర్చిపోకముందే దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి వేశారు. రఫి ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అయితే అతను టీడీపీ సానుభూతిపరుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆటోను తగులబెట్టినట్లు రఫి భావిస్తున్నాడు. ఆటో తగులబడటంతో జీవనోపాధి కోల్పోయానని రఫి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ వరుస ఘటనలతో పల్నాడులో అలజడి నెలకొంది.
రాజకీయ కక్షలతో వాహనాలు తగలబెట్టడమే కాకుండా పంట పొలాలు ధ్వంసం చేయడం మిర్చిని దగ్ధం చేయడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో పల్నాడులో ఎక్కువై పోయాయి. దీనిపై పోలీసులు దృష్టి సారించి అసలు నిందితులను అరెస్ట్ చేయాలన్న డిమాండ్స్ వినపడుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న వాదనలు వినపడుతున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
