Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: గుడి సమీపాన పురావస్తు తవ్వకాలు.. మట్టిలో కనిపించింది వెలికితీయగా..

పురావస్తు తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

AP News: గుడి సమీపాన పురావస్తు తవ్వకాలు.. మట్టిలో కనిపించింది వెలికితీయగా..
Ap News
Follow us
Fairoz Baig

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2024 | 8:45 PM

ప్రకాశం జిల్లాలో మరో నాగశాసనం వెలుగు చూసింది. కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మాన్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నాగ శాసనాన్ని గ్రామస్థుడు కురంగి నాగేశ్వరరావు గుర్తించారు. ఇదేదో పురాతన శాసనంలా ఉందని భావించిన ఆయన ఆ నాగ శాసనం ఫోటోలు తీసి శాసన పరిశోదకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ కు పంపారు. దీనిని పరిశీలించిన మీదట ఈ నాగ శాసనం పై 13వ శతాబ్దపు లిపి ఉందని నిర్ధారించుకున్నారు. సిద్ధి రాజు తిమ్మరాజు గుడిదగ్గర భోగ మండపం కట్టించిన సందర్బంగా నాగ శాసనం వేసినట్టు అందులో లిఖించారు. ఈ 13వ శతాబ్దపు నాగశాసనాన్ని అరుదైన 10 వ శతబ్దపు కాలంలో నిర్మించిన సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్దిలో భాగంగా లిఖించినట్టు గుర్తించారు. ఇలాంటి అరుదైన దేవాలయాలను, శాసనాలను పరిరక్షించు కోవడం అందరి బాధ్యత.

ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ప్రకాశంజిల్లాలో ఎక్కడ చూసినా నాగశాసనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళూ వాటిని గుర్తించే వారు లేక మరుగున పడిన శాసనాలను ఇటీవల కాలంలో చరిత్ర పరిశోధకుల కృషివల్ల ఎక్కువగా బయటపడుతున్నాయి. 10 శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వివిధ దేవాలయాల్లో చేసిన అభివృద్ది పనులు, నిర్మాణాలను వివరిస్తూ అప్పటి రాజుల, ధర్మదాతల విశేషాలను ఈ నాగశాసనాల తెలుసుకునే అవకాశం కలుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల విజయనగర పాలకుల మరో శాసనం వెలుగులోకి వచ్చింది. ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలం బసినేపల్లి – చెరుకుపల్లి గ్రామాల మధ్య ఏకరాతితో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 15వ శతాబ్దం కాలంలో నిర్మించిన శాసనం వెలుగు చూసింది. తాజాగా కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మాన్యేశ్వర స్వామి ఆలయం సమీపంలోక మరో నాగశాసనాన్ని గుర్తించారు. దీనిని పరిశీలిస్తే ఈ నాగ శాసనం పై 13వ శతాబ్దపు లిపి ఉంది. దేవాలయం సమీపంలో భోగ మండపం కట్టించిన సందర్బంగా నాగ శాసనం వేసినట్టు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.

Ap

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్..వీడియో
దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్..వీడియో
ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!
ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!
గుడి పడ్వా రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
గుడి పడ్వా రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
ఆన్‌లైన్ గేమింగ్‌పై సర్జికల్ స్ట్రైక్.. 357 వెబ్‌సైట్‌లు బ్లాక్
ఆన్‌లైన్ గేమింగ్‌పై సర్జికల్ స్ట్రైక్.. 357 వెబ్‌సైట్‌లు బ్లాక్
ఉప్పల్‌లో బ్లాక్‌ టిక్కెట్ల దందా!
ఉప్పల్‌లో బ్లాక్‌ టిక్కెట్ల దందా!
మీ పిల్లలను స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉంచడం ఎలా?
మీ పిల్లలను స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉంచడం ఎలా?
కూతుర్ని బైక్‌పై తీసుకెళ్తున్న తండ్రి! ఇంతలో ఒక్కసారిగా..
కూతుర్ని బైక్‌పై తీసుకెళ్తున్న తండ్రి! ఇంతలో ఒక్కసారిగా..
పిల్లలకు డబ్బా పాలు తాగిస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..
పిల్లలకు డబ్బా పాలు తాగిస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..
మండే ఎండలో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ మీ కోసం
మండే ఎండలో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ మీ కోసం
చెపాక్‌లో ‘ఎల్ క్లాసికో’ తేల్చుకోబోతున్న CSK vs MI!
చెపాక్‌లో ‘ఎల్ క్లాసికో’ తేల్చుకోబోతున్న CSK vs MI!