AP Employees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగింపు

AP Employees: ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల..

AP Employees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగింపు
AP Government
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 4:09 PM

AP Employees: ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కార్యాలయం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. బదిలీ గడువు జూన్‌ 17తో ముగియనుండగా, ఉద్యోగ సంఘాలు, జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.దీంతో ఆర్ధిక శాఖ జారీ చేసిన 116 జీవో గడువును జూన్ 30 తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకూ పది రోజులు మాత్రమే బదిలీలపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఐదేళ్ల పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా కూడా బదిలీలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేయలేదు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం బదిలీలపై నిషేదాన్ని కేవలం పది రోజులు మాత్రమే ఎత్తివేయడం వల్ల వివిధ శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు