ఏపీలో గుప్తనిధుల తవ్వకాల కలకలం.. చూసేందుకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగే షాక్

అక్రమార్కుల భాగోతం తెలుసుకున్న ఎండోమెంట్ అధికారులు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేకుండా దేవాలయ భూముల్లోకి చొచ్చుకొచ్చి..

ఏపీలో గుప్తనిధుల తవ్వకాల కలకలం.. చూసేందుకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగే షాక్
Excavations
Follow us

|

Updated on: Jun 16, 2022 | 9:32 PM

Andhra Pradesh: బంగారు నిధులు ఉన్నాయనే ప్రచారంతో.. గుప్తనిధుల వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. కృష్ణా జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ కు కూతవేటు దూరంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు సమచారం రావడంతో ఎండోమెంట్ అధికారులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు.

మచిలీపట్నం మున్సిపల్ కర్పోరేషన్ పరిధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్న ఘటనా స్థలాన్ని జిల్లా ఎండోమెంట్ అధికారి హరి గోపినాధ్ పరిశీలించారు. అయితే గుప్తనిధుల తవ్వకాలను అడ్డుకునేందుకు వచ్చిన అధికారులకు విస్తుపోయే నిజాలు కళ్లకు కట్టాయి. 2017 లోనే లీజు పర్మిషన్స్ ముగిసిన స్థలంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అక్రమంగా తరలిస్తున్న మట్టిని.. ఏకంగా ట్రక్కు 1800రూపాలయలకు అమ్ముకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది.

ఇవి కూడా చదవండి

అక్రమార్కుల భాగోతం తెలుసుకున్న ఎండోమెంట్ అధికారులు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేకుండా దేవాలయ భూముల్లోకి చొచ్చుకొచ్చి అక్రమ మట్టి తవ్వకాలు జరిపిన మురళి అనే వ్యక్తిపై శాఖ పరమైన చర్యలకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవంటూ అధికారులను ఎండోమెంట్ డిపార్టెంట్ ఆఫీసర్లు హెచ్చరించారు.