AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం.. గడిచిన 24 గంటల్లో 9,881 పాజిటివ్‌ కేసులు

AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 74,041 మందికి కరోనా

AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం.. గడిచిన 24 గంటల్లో 9,881 పాజిటివ్‌ కేసులు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 26, 2021 | 8:32 PM

AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 74,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 9,881 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,43,441 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కరోనాతో 51మంది మృతి చెందగా, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,735కి చేరింది. ఇక తాజాగా 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో 95,131 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, అలాగే గుంటూరు, కడప, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా, ఏపీ రాష్ర్టంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. మాస్క్‌ ధరించని వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్క్‌ ధరించకుండా నిబంబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో స్వచ్చందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నారు. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తే కేసులు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను దూరం చేసుకునేందుకు మాస్క్‌ ధరించకపోవడం కేసుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణంగా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Corona Treatment: తెలుగు రాష్ట్రాలకు కరోనా సెకెండ్ వేవ్ షాక్.. వేల సంఖ్యలో బెడ్లు..మరి సమస్యేంటి?

కరోనా పరీక్షల్లో నెగెటివ్‌.. కన్నతల్లి ఒడిలోనే కన్నుమూసిన కొడుకు.. గుండెలను పిండెస్తున్న హృదయ విదారక ఘటన

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!