AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి అవి మూసివేయాలని ఆదేశం

Andhra Pradesh Government: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం...

AP Corona: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి అవి మూసివేయాలని ఆదేశం
Andhra Pradesh Government
Subhash Goud
|

Updated on: Apr 26, 2021 | 9:34 PM

Share

Andhra Pradesh Government: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇక నుంచి ఏ ఫంక్షన్లకైనా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఏపీ వైద్యశాఖ స్పష్టం చేసింది. 50శాతం పరిమితితో ప్రజారవాణాకు అనుమతిస్తామని, సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. అలాగే ఫ్లెయింగ్‌ స్క్వాడ్‌తో ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీ నిర్వహిస్తామని తెలిపింది.

కోవిడ్‌ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తు్న్నామని, రెమిడెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని తెలిపింది. రెమిడెసివిర్‌ కొరత ఉంటే హెల్ఫ్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని సూచించింది.

కాగా, తాజాగా ఏపీలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కొత్తగా 9,881 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,43,441 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కరోనాతో 51మంది మృతి చెందగా, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,735కి చేరింది. ఇక తాజాగా 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో 95,131 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇవీ చదవండి:

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు

ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ