AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు.. రాబోయే మూడు రోజులపాటు ఆ ప్రాంతాల్లో..
AP Weather Report: భారత దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి కీలక్ అప్‌డేట్ విడుదల చేసింది భారత వాతావరణ శాఖ. దక్షిణ అరేబియా సముద్రంలోని..
AP Weather Report: భారత దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి కీలక్ అప్‌డేట్ విడుదల చేసింది భారత వాతావరణ శాఖ. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు మొత్తం, లక్ష ద్వీప ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తాజా వాతావరణ సూచనల ప్రకారంవ.. దక్షిణ అరేబియా సముద్రం మీద తక్కువ ఎత్తులలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా విస్తరించాయి. ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. కేరళ తీరం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అరేబియా సముద్రం ప్రాంతంలో ఎక్కువగా మేఘావృతమై ఉంది. దీని కారణంగా రాగల 2, 3 రోజుల్లో కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రారంభం అవటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్ష ద్వీప ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర – దక్షిణ ద్రోణి బలహీనపడిందని అదికారులు తెలిపారు. వీటి ఫలితంగా రాబోయే మూడు రోజులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులకు సంబంధించి నివేదికను విడుదల చేశారు వాతావరణ శాఖ అదికారులు.
ఈ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాబోవు మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర.. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.
రాయలసీమ.. రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.