Polavaram Project: పోలవరం ప్రాజెక్టు తొలి ఫలితానికి అంకురార్పణ.. డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల
గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం నుంచి నీటి విడుదలకు ముహూర్తం ఖరారైంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి ఫలితానికి ఇవాళ అంకురార్పణ జరగునుంది.
Polavaram Project Water Released Today: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం నుంచి నీటి విడుదలకు ముహూర్తం ఖరారైంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి ఫలితానికి ఇవాళ అంకురార్పణ జరగునుంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదు కాసేపట్లో గోదావరి నీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేశారు. స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేయనున్నారు. ఎపీ ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ సంయుక్తంగా తొలి ఫలితానికి అంకురార్పణ చేయనున్నాయి.
ఇవాళ ఉదయం 11.30 గంటలకు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీరు విడుదల చేస్తారు. వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్, ఆళ్ల నాని శ్రీకారం చుట్టనున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఈఎన్సీ నారాయణ రెడ్డితో పాటు అధికారులు పాల్గొంటారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ తరఫున రంగరాజన్ పాల్గొంటారు. గోదావరి నది నుంచి అప్రోజ్ కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఆ నీటిని స్పీల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజీకు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాకు, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరుతుంది.
ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరుతుంది. అప్రోచ్ చానెల్స్, స్పిల్ వే గేట్లను ఏర్ాపటు చేశారు. స్పిల్ చానెల్, పైలెట్ చానెల్ దాదాపుగా పూర్తయ్యాయి. గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. గోదావరి నుంచి ప్రవాహన్ని 6.6 కిలోమీటర్ల మేర మళ్లించనున్నారు.