AP CM Ys Jagan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. ప్రత్యేక హోదాపై చర్చ

AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రోలతో భేటీ అయ్యారు. గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ..

AP CM Ys Jagan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. ప్రత్యేక హోదాపై చర్చ
Follow us

|

Updated on: Jun 11, 2021 | 8:08 AM

AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రోలతో భేటీ అయ్యారు. గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అకీలక అంశాలపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకువచ్చినట్లు అధికారుల ద్వారా సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అంచనాలను ఆమోదించాలని.. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని మంత్రిని జగన్‌ కోరారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి తెలిపారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సహకరించాలి

కాగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సహకరించాలని, దీని కోసం రీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం జగన్‌ కోరారు. ఈ అంశానికి బీజేపీ మద్దతు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు పెద్ద సంఖ్యలో ఇల్లు కట్టించే అంశాన్ని కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని మరోసారి కేంద్రాన్ని కోరారు సీఎం జగన్‌. వీటితో సహా 10 అంశాలపై అమిత్ షా‌తో సీఎం జగన్ చర్చించారు. కాగా, అంతకుముందు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్‌తో పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టుకు అందాల్సిన నిధులు, తదితర పనుల వివరాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు సర్కార్ చర్యలు ప్రారంభించిందని,  పెండింగ్‌లో ఉన్న కాలేజీలకూ అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఏపీకి సహాయం చేస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖ చెప్పిందని గుర్తు చేశారు.

అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరంకు తరలించాలని కోరిన సీఎం.. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలని మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌ను కోరినట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

CM Ys Jagan Delhi Tour: ఢిల్లీ టూర్‌లో ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీలు