సిటీల్లోనే కాదు మారుమూల పల్లెల్లోనూ మాస్టర్ మైండ్స్ ఉన్నాయ్.. విజయనగరం కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇదే!

మెట్రో పాలిటిన్ సిటీల్లోనే కాదు మారుమూల పల్లెల్లో సైతం మాస్టర్ మైండ్స్ ఉన్నాయి.. ఆ మైండ్స్ మనం వాడుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అనే ఓ యువకుడి ఆలోచన అందరి మన్ననలు పొందుతుంది. అతని ఆలోచనే కాదు అతను అమలు చేసిన తీరు సైతం ఔరా అనిపిస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్న ప్రాంతంలో తన వంతు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ..

సిటీల్లోనే కాదు మారుమూల పల్లెల్లోనూ మాస్టర్ మైండ్స్ ఉన్నాయ్.. విజయనగరం కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇదే!
Sangamreddy Bhanumurthy
Follow us
G Koteswara Rao

| Edited By: Srilakshmi C

Updated on: Sep 02, 2023 | 11:26 AM

విజయనగరం, సెప్టెంబర్ 2: మెట్రో పాలిటిన్ సిటీల్లోనే కాదు మారుమూల పల్లెల్లో సైతం మాస్టర్ మైండ్స్ ఉన్నాయి.. ఆ మైండ్స్ మనం వాడుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అనే ఓ యువకుడి ఆలోచన అందరి మన్ననలు పొందుతుంది. అతని ఆలోచనే కాదు అతను అమలు చేసిన తీరు సైతం ఔరా అనిపిస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్న ప్రాంతంలో తన వంతు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నాడు ఆ యువకుడు.. ఇంతకీ ఎవరా యువకుడు? అతను కల్పిస్తున్న ఆ ఉద్యోగాలు ఏంటి అనుకుంటున్నారా? విజయనగరం జిల్లాలో మారుమూల పల్లెటూరు కి చెందిన సంగంరెడ్డి భానుమూర్తి అనే యువకుడు అద్భుతమైన ఆలోచనా తీరుతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద సిటిల్లోనే కంపెనీలు పెడితే గ్రామాల పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఏదో ఒకటి చేయాలని తన లక్షల శాలరీ వదులుకొని గ్రామాల బాట పట్టాడు.. నగరాల్లో ఉన్న హై ఫై యువత మాత్రమే కాదు గ్రామాల్లో ఉన్న మాష్టర్ మైండ్స్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడు.

స్లమ్ డాగ్ మిలినీయర్స్ లా అద్భుతాలు సృష్టించే మైండ్ ఉన్నప్పటికీ అవకాశాలు లేని గ్రామీణ యువతకు తమ సొంత గ్రామాల్లోనే ఉన్నతమైన సాప్ట్ వేర్ ఉద్యోగుల్లా తీర్చిదిద్దాలని అడుగులు ముందుకు వేశాడు. అందుకు మొదటగా తన సొంత ఊరు అయిన విజయనగరం జిల్లా మెరక ముడిధాం మండలం ఊటపల్లిని ఎంచుకున్నాడు. ఆ గ్రామంలోనే సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన సంగంరెడ్డి భానుమూర్తి కష్టపడి చదువుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత సాప్ట్ వేర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అలా సుమారు సుమారు ఆరేళ్ల పాటు చెన్నైలోనే ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే చార్టెడ్ అకౌంటెంట్ అయిన గాయిత్రితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారి తరువాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అలా 2019 లో వివాహం చేసుకున్న భానుమూర్తి కరోనా కారణంగా చెన్నై నుండి సొంత ఉరు అయిన ఊటపల్లి కి భార్య గాయిత్రితో కలిసి వచ్చాడు. అలా కొన్నాళ్ళు ఇంటి వద్దనే ఉన్న భానుమూర్తి తన గ్రామంతో పాటు చుట్టుప్రక్కల ఉన్న నిరుద్యోగ యువత ను చూశాడు. అందులో చాలామంది డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రతిభ ఉన్నా ఉద్యోగావకాశాలు లేక ఇంటి వద్దే ఉన్న నిరుద్యోగ యువతను చూశాడు.

దీంతో వెంటనే నిరుద్యోగ యువత సాప్ట్ వేర్ రంగంలో రాణించేందుకు కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే అతను చేసున్న ఉద్యోగానికి రిజైన్ చేసి విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు. ఆ సెంటర్ నుండి వందల మందికి మల్టీనేషన్ కంపెనీల్లో ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాడు. ఆ సమయంలోనే భార్యాభర్తలకు ఓ ఆలోచన వచ్చింది. ఇంత మంచి ప్రతిభ ఉన్న యువతకు మనమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తమ వద్దే పని చేస్తే ఇంకా బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చారు. అయితే వీరికి పెట్టుబడి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇక చేసేదిలేక భానుమూర్తి ఎండి గా, సీఈవో గా భార్య గాయత్రి ఉండి ఒక టెక్నికల్ ఎంప్లాయ్ ని మాత్రమే తీసుకొని కేవలం ముగ్గురుతో 2019 లో ఒక చిన్న కంపెనీని స్టార్టప్ గా ప్రారంభించారు. అలా స్టార్టప్ గా ప్రారంభమైన కంపెనీ కేవలం మూడేళ్లలో సుమారు యాబై మంది వరకు యువతకు ఉద్యోగావకాశాలు ఇవ్వగలిగిన స్థాయికి చేరుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వీరి కంపెనీ సుమారు ఆరు కోట్ల టర్నోవర్ కు చేరింది.

ఇవి కూడా చదవండి

గ్రామీణ స్థాయి యువతను తీసుకొని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న వీరు తమ కంపెనీ కి కూడా విలేజ్ మైండ్స్ అనే పేరుతో దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఈ విలేజ్ మైండ్స్ దేశవ్యాప్తంగా ప్రతి ప్రధాన కేంద్రాల్లో స్థాపించి ఆ యా ప్రాంతాల్లో ఉన్న స్థానిక గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెబుతున్నారు భానుమూర్తి దంపతులు. ఇలాంటి కంపెనీ మారుమూల ప్రదేశాల్లో ఉండటం ఉండటం సంతోషం అని, నిరుద్యోగులుగా ఉన్న తమకి ఈ కంపెనీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందని అంటున్నారు ఇక్కడి ఉద్యోగులు. అయితే ప్రస్తుతం సాప్ట్ వేర్ పరిస్థితి కొంచెం ఇబ్బంది గా ఉండటం వల్ల రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నామని, భవిష్యత్తులో ఈ కంపెనీ లో వందల మంది ఉద్యోగులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు భానుమూర్తి దంపతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..