Andhra Pradesh: ఆ రాజకుటుంబంలో వారసులకు ఒకే వ్యక్తి పేరు.. 15 తరాలుగా కొనసాగుతోన్న ఆనవాయితీ!
ఆ రాజ కుటుంబంలో వారసులకు ఒకే వ్యక్తి పేరు. ఆ కుటుంభంలో పెళ్లి తర్వాతే రాజ కుటుంబ వారసులకు వివాహం. ఎప్పుడో ఇచ్చిన మాటను ఇప్పటికే పాటిస్తున్న రాజ కుటుంభం.. ఎక్కడో తెలుసా? వెంకటగిరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఓ పట్టణం. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వెంగటగిరి ఒకప్పుడు సంస్థానంగా వెంగటగిరి రాజాలు పరిపాలించేవారు. దశాబ్దాల క్రితం ఆ సంస్థనానికి శత్రు రాజ్యం నుంచి ప్రమాదం ఏర్పడింది. యుద్ధం జరిగే సమయంలో శత్రువులను ఓడించేందుకు రాజ్యంలోని యాచడు అనే..

నెల్లూరు, నవంబర్ 6: ఆ రాజ కుటుంబంలో వారసులకు ఒకే వ్యక్తి పేరు. ఆ కుటుంభంలో పెళ్లి తర్వాతే రాజ కుటుంబ వారసులకు వివాహం. ఎప్పుడో ఇచ్చిన మాటను ఇప్పటికే పాటిస్తున్న రాజ కుటుంభం.. ఎక్కడో తెలుసా? వెంకటగిరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఓ పట్టణం. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వెంగటగిరి ఒకప్పుడు సంస్థానంగా వెంగటగిరి రాజాలు పరిపాలించేవారు. దశాబ్దాల క్రితం ఆ సంస్థనానికి శత్రు రాజ్యం నుంచి ప్రమాదం ఏర్పడింది. యుద్ధం జరిగే సమయంలో శత్రువులను ఓడించేందుకు రాజ్యంలోని యాచడు అనే వ్యక్తి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో యాచడికి అప్పటి రాజు నీకు ఏం కావాలో కోరుకో తీరుస్తానని మాటిచ్చారు. అప్పుడు ఆ యాచడు ఇలా కోరాడు.

Royal Family
‘నా కుటుంబంలో పెళ్లి తరువాతే మీ కుటుంబంలో పెళ్లి జరగాలి, ఆ తలంబ్రాలే వాడాలి. మీ కుటుంభంలో వారసులకు నాపేరు ఉండలని కోరాడట. సాధారణ వ్యక్తి కోరిన ఆ కోరికలు ఇప్పటికీ ఆ.. రాజ కుటుంభంలో ఆచరింప బడుతూ వస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ వెంకటగిరి సంస్థానానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెంకటగిరి సంస్థానానికి యుద్ధ రూపంలో ఆపద సమయంలో రాజ్యాన్ని కాపాడుకునేందుకు అప్పటి రాజు రకరకాల ప్రణాళికలు సిద్దం చేశాడు.

Royal Family
అందులో భాగంగా వెంకటగిరి కి చెందిన యాచడు అనే వ్యక్తి రాజ్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి రాజ్యానికి సహాయ పడ్డాడు. ఆ త్యాగానికి గుర్తుగా ఇప్పటికే ఆ మాటను నెరవేర్చుతోంది ఆ కుటుంబం. అప్పటి వెంకటగిరి సంస్థానం కాంపాలెం హరిజన వాడకు చెందిన యాచడు కుటుంబంలో శుభ కార్యం తర్వాతే రాజ కుటుంబంలో ఇప్పటికే ఏ కార్యక్రమం అయినా జరుగుతోంది.

Royal Family
రాజుల ఇంట్లో పెళ్లికి యాచడు కుటుంబం నుంచే తలంబ్రాలు రాజ కుటుంబంలో పెళ్లి జరిగితే ఇప్పటికీ యాచకుడి ఇంట్లో పెళ్లి జరిగిన తలంబ్రాలతోనే పెళ్లి చేసుకుంటారు. రాజా వెలుగోటి గోపాల కృష్ణ యాచేంద్ర, రాజా వెలుగొటి సాయికృష్ణ యాచేంద్ర, రాజా సర్వజ్ఞ కుమార యాచేంద్ర, సర్వ సమర్థ సాయి రాజా గోపాల కృష్ణ యాచేంద్ర.. ఇలా రాజా కుటుంభం వారసుల పేరు చివర యాచడి పేరు చేర్చుకుంటారు. ప్రస్తుతం సర్వ సమర్థ సాయి రాజా గోపాల కృష్ణ యాచేంద్ర (14) ప్రస్తుత తరం నడుస్తోంది.

Royal Family
15 తరాల నుంచి వెంకటగిరి సంస్థానంలో రాజుల పేరు చివర యాచేంద్ర అని యాచడి కోరిక ప్రకారం రాజులు ఇప్పటికీ పెట్టుకోవడం విశేషం. ఈరోజు ఇచ్చిన మాట రేపు మర్చిపోతున్నా నేటి రోజుల్లో వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాటకు ఆ రాజా కుటుంబం గుర్తు పెట్టుకొని మరి ఆచరిస్తుందంటే, ఈ కుటుంబం మాత్రం తమ పూర్వీకులు ఇచ్చిన మాటను ఇప్పటికి నిలబెట్టుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








