AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ కారిడార్ కోసం మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కి.మీ.ల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. ఇది తిరుపతి గుండా వెళ్తే భక్తులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు కారిడార్‌ను 576.6 కి.మీ.ల అలైన్‌మెంట్‌తో నిర్మించనున్నారు.

Andhra Pradesh: గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
AP Bullet Train Project:
Krishna S
|

Updated on: Aug 29, 2025 | 7:00 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైళ్లు ఏపీలోని పలు జిల్లాల గుండా వెళ్తాయి. వీటిలో ఒకటి రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుండడం విశేషం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. సాధారణంగా గంటల కొద్దీ పట్టే ప్రయాణం కేవలం ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతుంది.

హైదరాబాద్-చెన్నై వయా అమరావతి

ఈ బుల్లెట్ రైలు మార్గం హైదరాబాద్ నుంచి మొదలై శంషాబాద్, సూర్యాపేట్, ఖమ్మం దాటిన తర్వాత ఏపీలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అమరావతి, గుంటూరు, చీరాల మీదుగా చెన్నై చేరుకుంటుంది. ఈ మార్గం మొత్తం 744 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 448 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్ ఉంటాయి. ఈ రైలు తిరుపతి మీదుగా వెళ్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి.

హైదరాబాద్-బెంగళూరు.. వయా కర్నూలు, అనంతపురం

మరొక బుల్లెట్ రైలు మార్గం హైదరాబాద్ నుంచి మొదలై.. చాలావరకు హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. ఈ మార్గం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 576 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో ఏపీలో 263 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ దగ్గర ఉన్న కియా కార్ల కంపెనీ కోసం ప్రత్యేకంగా ఒక స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే బెంగళూరు నుంచి చెన్నైకి కూడా ఇలాంటి ప్రాజెక్టు వస్తే, ఈ నాలుగు నగరాలు ఒక పెద్ద బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌గా అనుసంధానమవుతాయి. దీని వల్ల ప్రయాణం చాలా సులభంగా, వేగంగా మారుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!