AP TDP: మార్చి 14న టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల.. 25 నుంచి 30 స్థానాలకు ప్రకటించే అవకాశం

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు..

AP TDP: మార్చి 14న టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల.. 25 నుంచి 30 స్థానాలకు ప్రకటించే అవకాశం
Ap Tdp
Follow us
pullarao.mandapaka

| Edited By: Subhash Goud

Updated on: Mar 13, 2024 | 6:53 PM

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో 94 స్థానాలకు టిడిపి అభ్యర్థులను ప్రకటించగా ఐదు స్థానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో,3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత మొదటి విడత జాబితాలో సీట్లు దక్కని ఆశావహులు, సీనియర్లను పిలిచి మాట్లాడి వారికి నచ్చజెప్పి పంపించారు చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనేక విధాలుగా సర్వేలు చేసి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సీట్లు దక్కని అభ్యర్థులకు అధికారంలోకి రాగానే కచ్చితంగా ఆదుకుంటామని వారికి హామీ ఇస్తున్నారు చంద్రబాబు. ఇక టీడీపీ – జనసేన రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాల్లో తీసుకున్న నిర్ణయాల పైన వారందరికీ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. చంద్రబాబుతో బయటకు ముందు తమ బలాన్ని నిరూపించుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ తర్వాత అధిష్టానం వద్ద మాట్లాడిన తర్వాత వారందరూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు చంద్రబాబు నిర్ణయమే తమకు ఫైనల్ అని చాలామంది అభ్యర్థులు క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించడం, నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులను అధిగమించడంలో చంద్రబాబు చాలా వరకు సక్సెస్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొదటి విడత జాబితా ప్రకటన తర్వాత బీజేపీతో పొత్తులు ఖరారు కావడం ఆ తర్వాత సీట్ల సర్దుబాటు జరిగింది. దీంతో రెండో విడత జాబితాను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం

ఇవి కూడా చదవండి

మొదట్లో టీడీపీ – జనసేన మాత్రమే కొత్తలో ఉండగా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే లోకి చేరింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు.రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రమంత్రి షేకావత్, ఎంపీ జయంత్ పాండా లు ఏపీకి వచ్చారు మొదట బిజెపి రాష్ట్ర నాయకత్వంతో సుదీర్ఘ చర్చలు జరిపారు అదేరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోను బిజెపి పెద్దలు భేటీ అయ్యారు సీట్ల సర్దుబాటుపై బీజేపీ – జనసేన మధ్య చర్చలు జరిగాయి. ఇక ఆ తర్వాత రోజు బీజేపీ పెద్దలు, పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పొత్తులో భాగంగా మూడు పార్టీల ఉమ్మడి కీలక సమావేశం జరిగింది. సుమారు 8 గంటలపాటు జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చింది.

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై తుది నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లోనూ, బీజేపీ 6 లోక్ సభ,10 అసెంబ్లీ స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట్లో 24 అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్… ఆ తర్వాత మూడు పార్టీల ఉమ్మడి సమావేశంలో ఒక మెట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 24 స్థానాల్లోనూ 3 స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు.. సెట్ లో సర్దుబాటు కొలిక్కి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశారు. మొత్తం 50 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు ఎంపికైన దృష్టి సారించారు.

దీంట్లో భాగంగా మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటివరకు కొలిక్కి వచ్చిన స్థానాల్లోని అభ్యర్థులను ఈనెల 14న ప్రకటించనున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.25 నుంచి 30 అసెంబ్లీ, పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి జాబితాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ ద్వారా అభ్యర్థులను ప్రకటించారు. ఇకపై ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను వారే ప్రకటించనున్నారు.. ఈనెల 17న చిలకలూరిపేటలో కూటమి పార్టీల బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు అవుతుండడంతో ఈ లోగానే సాధ్యమైనంతవరకు అభ్యర్థులను ప్రకటించేలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. అయితే రెండో జాబితాలో ఎవరికి సీటు దక్కుతుందో, ఎవరికి సీటు దక్కదు అనేది ఉత్కంఠ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి