Half Day Schools: ఏపీలో స్కూళ్లకు ఒంటిపూట బడులు అప్పటి నుంచే.. తాజా అప్‌డేట్ ఏంటంటే!
మార్చి ఆరంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఒంటిపూట బడులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని పిల్లలు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. యేటా మార్చి 15 నుంచే ప్రారంభమయ్యే ఒంటిపూట బడులు ఈ ఏడాది ఆలస్యం కానుంది. అయితే ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖ..
అమరావతి, మార్చి 13: మార్చి ఆరంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఒంటిపూట బడులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని పిల్లలు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. యేటా మార్చి 15 నుంచే ప్రారంభమయ్యే ఒంటిపూట బడులు ఈ ఏడాది ఆలస్యం కానుంది. అయితే ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖ అధికారికంగా ప్రకటించలేదు. ఒంటిపూట బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పేరుతో వెలువడిన ప్రకటనలో ఈ మేరకు తెలుస్తోంది.
మరోవైపు మార్చి 18 నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఒంటిపూట బదులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువవుతోందని, పిల్లలు వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో ఒంటిపూట బడులు త్వరగా ప్రారంభించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు కూడా. దీనిపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
మరోవైపు తెలంగాణాలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఉదయం 7.45 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ తరగతులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24వ తేదీ చివరి పనిదినం. ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఏపీలో మాత్రం ఒంటిపూట బడుల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 15 కంటే ముందుగానే ఒంటిపూట బడులు స్టార్ట్ చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుతం ఏ నిర్ణయం ప్రకటించలేదు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.