Minister Kodali Nani: కె-కన్వెన్షన్‌లో కేసినో.. మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు..
Kodali Nani - Casino: మంత్రి కొడాలి నానికి సంబంధించిన కె-కన్వెన్షన్ హాల్‌లో కేసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది.
Kodali Nani – Casino: మంత్రి కొడాలి నానికి సంబంధించిన కె-కన్వెన్షన్ హాల్‌లో కేసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది. మంత్రి ఆధ్వర్యంలో ఈ కేసినో నిర్వహించారంటూ విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలోని కె-కన్వెన్షన్ హాల్‌లో కేసినో నిర్వహించారు. ఈ మంత్రి కొడాలికి నానినే దీనికి కర్త, కర్మ, క్రియ అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా కె-కన్వెన్షన్ సెంటర్లో కేసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అసభ్య నృత్యాల నిర్వహణ ద్వారా రూ.500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో ఆరోపించారు.
అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని దెబ్బతీసే చర్యలను పోలీసులు ఉపేక్షించటం తగదన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Also read:
Career Option: ఇంటర్ తర్వాత కెరీర్ ఎంపిక ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇలా చేయండి.. మంచి జీతంతోపాటు..
Chandrababu Covid Positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా.. లైవ్ వీడియో