Andhra Pradesh: టీడీపీలో ‘జూనియర్’ రచ్చ.. కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్..

జూనియర్‌ ఎన్టీఆర్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి జూనియర్‌ని కావాలనే దూరం పెట్టారన్న విమర్శలకు ఈ కామెంట్స్ సమాధానం ఇచ్చే ప్రయత్నామేనా? జూనియర్‌ను కావాలనే దూరం పెట్టారని..

Andhra Pradesh: టీడీపీలో ‘జూనియర్’ రచ్చ.. కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్..
Jr Ntr, Nara Lokesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 25, 2023 | 3:11 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి జూనియర్‌ని కావాలనే దూరం పెట్టారన్న విమర్శలకు ఈ కామెంట్స్ సమాధానం ఇచ్చే ప్రయత్నామేనా? జూనియర్‌ను కావాలనే దూరం పెట్టారని ఎమ్మెల్యే వంశీ చేసిన కామంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో లోకేష్ రెస్పాండ్స్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావడానికి పెరుగుతున్న ఒత్తిడి, తనపై విమర్శలు తప్పించుకునే నేపథ్యంలో లోకేష్ స్పందన కీలకంగా మారింది. ఇదే అంశంపై టీవీ9తో మాట్లాడారు లోకేష్.

జూనియర్‌ ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వస్తే వందశాతం ఆహ్వానిస్తామన్నారు లోకేష్‌. ఇంతకీ ఈ మాట అనడానికి కారణం ఏంటి? అవును ఇక్కడే ఉంది అసలు విషయం.. ఇటీవల టీవీ9 ఇంటర్వ్యూలో వచ్చిన చర్చే దీనికి కారణం. గన్నవరం ఎపిసోడ్‌ సందర్భంగా టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు వల్లభనేని వంశీ. మొదట ఉన్న తెలుగుదేశంపార్టీ వీడిపోవడానికి కారణం ఏంటని బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో రజనీకాంత్‌ ఒకటికి పదిసార్లు వల్లభనేని వంశీని ప్రశ్నించడం జరిగింది. ఫస్ట్‌ టైమ్‌ వంశీ అసలు విషయం బయటపెట్టారు.. అప్పుడే జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు తెరమీదకు వచ్చింది. లోకేష్‌ మధ్య ఉన్న సమస్యతోనే తాము బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ రాజకీయాల్లో వస్తే తాము ఆయనకు మద్దతు ఇస్తామన్న అనుమానంతోనే తమపై తప్పుడు కథనాలు ప్రసారం చేయించారని, దీంతో పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు వంశీ. అంతేకాదు. చంద్రబాబుకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది ఈ వ్యవహారం. దీంతో లోకేష్‌ అనివార్యంగా స్పందించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. పైగా జూనియర్‌ను కావాలని దూరంగా పెడుతున్నారన్న చర్చ కూడా పార్టీలో ఒత్తిడి పెంచుతోంది. గతంలో బుచ్చయ్యచౌదరి వంటి సీనియర్లు కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అవసరాన్ని గర్తుచేసిన సందర్భాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..