Andhra Pradesh: టాప్‌-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానం.. నివేదిక వెల్లడి

2021–22లో దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌-10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయని..

Andhra Pradesh: టాప్‌-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానం.. నివేదిక వెల్లడి
Andhra Pradesh
Follow us
Subhash Goud

|

Updated on: Oct 10, 2022 | 11:13 AM

2021–22లో దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌-10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలతో పశ్చిమబెంగాల్‌ మొదటి స్థానంలో ఉండగా, 109.27 కోట్లతో ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో, 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయని నివేదిక వెల్లడించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ లో 52.90 కోట్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వశాఖ వెల్లడించింది. నివేదిక ఎలక్ట్రానిక్‌ సేవల లావాదేవీలను చట్టబద్దతమైన, చట్ట బద్దత లేని సేవలు, వ్యాపార పౌర సేవలు, సమాచార సేవలు, మొబైల్‌ గవర్నెన్స్‌, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలు వంటి ఆరు విభాగాలుగా వర్గీకరించింది. ఏపీ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్‌ సేవల లావాదేవీలు నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది.

4.16 కోట్ల చట్టబద్ధమైన, చట్టబద్ధత లేని లావాదేవీలు, 10.76 కోట్ల యుటిలిటీ బిల్లు చెల్లింపుల లావాదేవీలు, 4.13 కోట్ల సమాచార సేవల లావాదేవీలు, 33.83 కోట్ల సామాజిక ప్రయోజన లావాదేవీలు, 23,000 వ్యాపార పౌర సేవల లావాదేవీలు జరిగాయని నివేదిక పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కార్యక్రమాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తూ ప్రత్యేక డిజిటల్ కార్యదర్శులను నియమించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు జరిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అన్ని సేవలను అందిస్తోంది. నవరత్నాల్లో పథకాల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఈ లావాదేవీలను సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరిస్తూ ఈ-గవర్నెన్స్‌లో ఏపీ నాలుగో స్థానం సాధించిందని నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి