YSRCP Politics: బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..? ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ

ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ విషయంలో వైసీపీ వెర్షన్ మారుతుందా..? ఏపీలో అధికారాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటికైనా తన పొలిటికల్ స్టాండ్ మార్చుకుంటుందా..? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ బీజేపీకి వెన్ను దన్నుగా నిలిచింది.. పొత్తు లేకున్నా పొత్తులో ఉన్నట్లే అన్ని బిల్లులకు వెనుక ముందు ఆలోచించకుండా మద్దతు ఇచ్చింది.

YSRCP Politics: బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..? ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ
Ys Jagan
Follow us
S Haseena

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 23, 2024 | 7:36 PM

ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ విషయంలో వైసీపీ వెర్షన్ మారుతుందా..? ఏపీలో అధికారాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటికైనా తన పొలిటికల్ స్టాండ్ మార్చుకుంటుందా..? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ బీజేపీకి వెన్ను దన్నుగా నిలిచింది.. పొత్తు లేకున్నా పొత్తులో ఉన్నట్లే అన్ని బిల్లులకు వెనుక ముందు ఆలోచించకుండా మద్దతు ఇచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయాలతో సంబంధం లేదని పరిపాలన పరమైన అంశాల్లో మద్దతు ఇస్తామని జగన్ పదేపదే చెప్తూ వచ్చారు. విశాఖపట్నం వేదికగా జరిగిన బహిరంగ సభలో సైతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టంగా ప్రకటించారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది ఏపిలో పరిణామాలు మారిపోవడం.. పొత్తులపై దాదాపు స్పష్టత రావడంతో చివరిగా పొత్తులో మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసి కూటమిగా అడుగులు వేశాయి. దీంతో ఏపీలో అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. అయితే, శాసనసభలో దాదాపు పట్టు కోల్పోయిన వైసీపీకి అటు పెద్దల సభల్లో మాత్రం ఎక్కడా తన ప్రాభావం తగ్గలేదు. ముఖ్యంగా అటు మండలి ఇటు రాజ్య సభలో తన పట్టును కొనసాగిస్తూ వచ్చింది. అయితే, మండలిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్దల సభలో పోరాటం చేస్తున్న వైసీపీ ఇప్పుడు రాజ్యసభలో ఎలా వ్యవహరిస్తుంది.. అన్నది రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు జరగబోయే పార్లమెంటు సమావేశంలో తమ వానిని బలంగా వినిపిస్తామని స్పష్టం చేస్తోంది.. ప్రధానంగా ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన ఎంపీలకు.. ఇదే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటుగా రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం, ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ, సోషల్ మీడియా పేరుతో వేధింపులకు దిగిన అంశాలను పార్లమెంటు వేదిక ఎండగడతామని స్పష్టం చేసింది.. ఇక వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న వక్ఫ్ బిల్లుకు సంబంధించిన అంశాన్ని సైతం పార్లమెంట్లో ప్రస్తావిస్తామని.. ఆమోదం తెలిపే ప్రసక్తి లేదని వైసిపి స్పష్టం చేస్తోంది.. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటుగా ఏపీకి సంబంధించిన ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తామని ప్రకటించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ స్పష్టంగా ఈ అంశాలపైన తమ వాణిని వినిపిస్తామని చెప్తున్నా.. ఏపీలో టీడీపీ తమ ప్రత్యర్థిని భావిస్తున్న వైసీపీ.. బిజెపితో సఖ్యత విషయంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురవుతున్న పరిణామాలు ఇబ్బందికరంగానే మారాయి. తాజాగా పార్లమెంటులో ఆయా బిల్లులకు వ్యతిరేకంగా వైసీపీ తమ వాణిని వినిపించినా లేదా ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వక్ఫ్ బిల్లు, సోషల్ మీడియా కేసులు లాంటి అంశాలను ప్రస్తావించినా.. కూడా బిజెపికి వ్యతిరేకంగా గొంతు ఎత్తినట్లే అవుతుంది. కాబట్టి బయట ప్రకటన చేసినట్లు పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..