AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏ పార్టీలో భవిష్యత్‌ ఉందో అక్కడ ఉండొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన గల్లా అరుణ..

Andhra Pradesh: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణ సంచలన కామెంట్స్ చేశారు. తన అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

Andhra Pradesh: ఏ పార్టీలో భవిష్యత్‌ ఉందో అక్కడ ఉండొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన గల్లా అరుణ..
Galla Aruna Kumari
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2022 | 8:13 AM

Share

Andhra Pradesh: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణ సంచలన కామెంట్స్ చేశారు. తన అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టీడీపీకి తాము పెద్ద దిక్కు కాదంటూ కుండబద్దలు కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాజీమంత్రి గల్లా అరుణకుమారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంత క్రియాశీలకంగా వ్యవహరించారామె. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు గల్లా అరుణ. కానీ, ఆమె తనయుడు గల్లా జయదేవ్ మాత్రం టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక్కడిదాకా ఎలా ఉన్నా, తాజాగా సంచలన కామెంట్స్‌ చేశారు గల్లా అరుణకుమారి. తన రాజకీయ జీవితం ముగిసిందని ప్రకటించారు. తాను చేపట్టని పదవి లేదని, చూడని రాజకీయాలు లేవన్నారు గల్లా అరుణ. తన సంకల్పమే తన భవిష్యత్ అని స్పష్టం చేశారు.

రాజకీయాలకు తాను దూరంగా ఉన్నా, తనకు ఇంకా అనుచర వర్గం ఉందని స్పష్టం చేశారు గల్లా అరుణకుమారి. ఇప్పుడు వాళ్లకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని, వాళ్లకు ఎక్కడ భవిష్యత్తు ఉంటే, అక్కడ ఉండాలని చెప్పినట్టు వెల్లడించారు. టీడీపీకి చంద్రబాబే పెద్ద దిక్కు అని, తాము కాదని స్పష్టం చేశారు. గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నారు కాబట్టి, తాము తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తామని చెప్పారు గల్లా అరుణ. కొన్నాళ్ల కిందట ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అప్పటినుంచి మళ్లీ ఎక్కడా కనిపించలేదు. తాజాగా మీడియా ముందు వచ్చి ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలోనే ప్రకటించారు గల్లా అరుణకుమారి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..