Andhra Pradesh: టీడీపీ నేతపై హత్యాయత్నం.. వ్యక్తిగత కక్షనా? మరేదైనా కోణం ఉందా? సంచలనంగా మారిన ఇష్యూ..

తునిలో టీడీపీ నేతపై వ్యక్తిగత కక్షతో అటాక్‌ జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? ప్రశాంతంగా వుండే తునిలో సినిమాటిక్‌ క్రైమ్‌ కథా చిత్రమ్‌

Andhra Pradesh: టీడీపీ నేతపై హత్యాయత్నం.. వ్యక్తిగత కక్షనా? మరేదైనా కోణం ఉందా? సంచలనంగా మారిన ఇష్యూ..
Tdp
Follow us

|

Updated on: Nov 18, 2022 | 8:26 AM

తునిలో టీడీపీ నేతపై వ్యక్తిగత కక్షతో అటాక్‌ జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? ప్రశాంతంగా వుండే తునిలో సినిమాటిక్‌ క్రైమ్‌ కథా చిత్రమ్‌ హాట్‌ టాపిక్‌గా మారిందిప్పుడు. అవును, తునిలో టీడీపీ నేత శేషగిరిపై హత్యాయత్నంతో.. జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. గురువారం పొద్దున్నే 6:30 గంటలకు మాలాధారణలో వచ్చి.. భిక్షం అడిగి.. శేషగిరి రావుపై హత్యాయత్నం చేయడం స్థానికంగా సంచలనం రేపింది. కత్తితో దాడి చేస్తుండగా.. ప్రతిఘటించడంతో.. శేషగిరిరావుకు పెను ప్రమాదం తప్పింది.

కానీ అప్పటికీ ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హత్యాయత్నం కేసులో మంత్రి రాజా పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రవీంద్ర నాధ్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, జ్యోతుల నెహ్రు, జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో.. అతనిని చంపాల్సిన అవసరం ఎవరికి వుందో తునిలో అందరికీ తెలుసంటున్నారు శేషగిరి కుటుంబసభ్యులు.

మరోవైపు ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిజానిజాలు తేల్చి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..