Navajeevan Express: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం.. ప్యాంట్రీ కార్ లో చెలరేగిన మంటలు..
నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. ట్రైన్ లోని ప్యాంట్రీ కార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో...

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. ట్రైన్ లోని ప్యాంట్రీ కార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతోప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును గూడూరు రైల్వే స్టేషన్లో ఆపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా రైలు సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. రైల్వే అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. రైలులో అగ్ని ప్రమాదం సంభవించి నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాగా.. గతంలోనూ దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైలు.. చివరి బోగీలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేశారు. మంటలు చెలరేగిన బోగీని అక్కడే వదిలేశారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రయాణికులు ప్రాణ భయంతో రైలు నుంచి దూరంగా పరులు తీశారు. అయితే అగ్ని ప్రమాదం జరిగింది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటల్ని ఆర్పివేశారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..