అమ్మా.. అనే పిలుపు కోసం 20 ఏళ్ల ఎదురుచూపు.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే..

నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్‌ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఖాసిం స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే సంతానం కోసం ఈ దంపతులు ఎన్నో దేవుళ్లకు మొక్కారు. 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నవమాసాలు నిండటంతో పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త ఖాసీం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా డాక్టర్లు శస్త్రచికిత్స చేసి..

అమ్మా.. అనే పిలుపు కోసం 20 ఏళ్ల ఎదురుచూపు.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే..
Sheikh Nazira
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 10, 2023 | 10:34 AM

నందిగామ, ఆగస్టు 10: అమ్మా.. అనే పిలుపు కోసం ఆ తల్లి 20 ఏళ్లు ఎదురుచూసింది. బిడ్డల కోసం ఎందరో దేవుళ్లకు మొక్కింది. చివరకు 20 ఏళ్లకు దేవుడు కరునించాడు. నవమాసాలు నిండాయి. ఇన్నేళ్ల నిరీక్షణకు ప్రతిఫలంగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. రత్నాల్లాంటి బిడ్డల్ని చూసుకుని మురిసిపోయింది. ఐతే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. బిడ్డల ముద్దుమురిపాలు చూడకముందే, వారితో నోరారా అమ్మా అని పిలిపించుకోకముందే విధి కర్కశంగా ఆ తల్లి ప్రాణాలను తీసింది. ఒక్కసారిగా అందరి గుండెలు పగిలాయి.. దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న పసికందుల రోదన చూసి చెమర్చని కళ్లులేకుండా పోయాయాఊరిలో. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్‌ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఖాసిం స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే సంతానం కోసం ఈ దంపతులు ఎన్నో దేవుళ్లకు మొక్కారు. 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నవమాసాలు నిండటంతో పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త ఖాసీం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. ఐతే నజీరా తీవ్ర ఆశ్వస్థతకు గురైంది.

ఈ క్రమంలో ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి (ఆగస్టు 9) నజీరా మృతి చెందింది. బుధవారం పల్లగిరిలో ముస్లిం సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు నజీరాకు అంత్యక్రియలు నిర్వహించారు. నజీరా మృతితో ఆ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త, బంధువుల ఆర్తనాదాలతో స్థానికంగా విషాదం అలముకుంది. తల్లి మృతి చెందడంతో పుట్టిన కందులనైనా బ్రతికించుకోవాలని ఖాసీం సర్వశక్తులా పోరాడుతున్నాడు. ప్రస్తుతం పిల్లలు ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. భార్యను కోల్పోయాను.. కనీసం పిల్లలనైనా కాపాడుకోగలనో.. లేనో అని ఖాసిం కంటనీరు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్