Kakinada: బోల్తా పడిన లిక్కర్ వ్యాన్.. ఆ తర్వాత సీన్ చూడండి నా సామిరంగా…
లిక్కర్ లోడ్‌తో వెళ్తుంది ఆ మినీ వ్యాన్. బీర్, బ్రాంది, విస్కీ, వైన్ ఇలా అన్ని సీసాలు అందులో ఉన్నాయి. అయితే ప్రమాదవశాత్తూ ఆ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో సరకు అంతా రోడ్డుపై పడింది. దీంతో స్థానికులు గుమికూడారు. అసలు ఆ వ్యాన్‌లో ఎవరైనా ఉన్నారా..? వారికి ఏమైనా దెబ్బలు తగిలాయా..? ఇలా ఏం చూడలేదు. అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్ళిపోయారు. కొందరు అయితే బస్తాలతో వచ్చేశారు. ఘటనపై సమాచారం అందడంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. క్రౌడ్‌ను అదుపుచేశారు. ఆపై ట్రాఫిక్ క్లియర్ చేశారు. వీడియో దిగువన చూడండి.
కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది..ఈ ఘటనలో కొన్ని బాటిళ్లు ధ్వంసం కాగా మరికొన్ని కిందపడ్డాయి.. ఇంకేముంది రోడ్డుపై అలా బాటిల్స్ కనపడగానే జనాలు ఇలా వచ్చేశారు. కిందపడ్డ మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. అబ్బా ఛాన్స్ దొరికిందిలే అనుకుంటూ బాటిళ్లను దొరికినవాళ్లకు దొరికినట్లు ఎత్తుకెళ్లారు. కొందరు మాత్రం ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు.. దీంతో స్పాట్‌కి చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది స్థానికులు మద్యం బాటిళ్లు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ అప్పటికే చాలామంది అందినకాడికి అందిన బాటిల్స్ తీసుకెళ్లారు. ఇంకే వేరేది ఏమైనా ఆగేవారు ఏమో కానీ.. అక్కడుంది నోరూరించే లిక్కర్. ఇక మందుబాబులను ఆపడం ఎవరితరం అవుతుంది చెప్పండి. అందుకే పోలీసులు కూడా క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి ఆపసోపాలు పడ్డారు.