Chiranjeevi: అసలు ఏపీ ప్రభుత్వాన్ని చిరు ఏమన్నారు... ఫుల్ వీడియో మీరు చూశారా.. ఇదిగో

Chiranjeevi: అసలు ఏపీ ప్రభుత్వాన్ని చిరు ఏమన్నారు… ఫుల్ వీడియో మీరు చూశారా.. ఇదిగో

Ram Naramaneni

|

Updated on: Aug 10, 2023 | 1:15 PM

‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’.. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరంజీవి అన్న ఈ మాటలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన మాటలపై వైసీపీ నేతలు కూడా కాస్త ఘాటుగానే రియాక్టయ్యారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. ఏకంగా నిరసనకు కూడా దిగారు. అసలు చిరు ఏం మాట్లాడారు.. ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఆ మాటలు అన్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్ కాకుండా ఫుల్ వీడియోలో ఏముంది..? ఆ విషయంపైనే మీకు ఇప్పుడు క్లారిటీ ఇవ్వబోతున్నాం. దిగువన ఫుల్ వీడియో ఇచ్చాం. చూసేయ్యండి.

చిరు కామెంట్స్‌తో అటు సినిమా వర్గాలకు, ఏపీ అధికార పక్ష నేతలకు మాటల యుద్ధం జరుగుతున్న వేళ…  భోళాశంకర్‌ సినిమా టికెట్ల ధర పెంచుకునేందుకు అనుమతి విషయంలో  మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వం మొత్తం 12 విషయాల్లో వివరణ కోరింది. అంతే కాదు వివరణ కోసం పరిశీలనాధికారులు కోరే ఇతర పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని తన ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఓ నెంబర్‌ 13లో పేర్కొన్న రిజిస్ట్రేషన్‌ నిబంధనను సినిమా నిర్మాతలు పాటించలేదని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఆ నిబంధనను భోళాశంకర్‌ సినిమా పాటించలేదని తెలిపింది.  సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు సమాచార ప్రసార విభాగం జారీ చేసిన నిబంధనల ప్రకారం మొత్తం సెన్సార్‌ అయిన సినిమాలో కనీసం 20 శాతం సినిమా షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగాలనే ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సూచించింది. అనుమతి కోరుతూ నిర్మాతలిచ్చిన లేఖలో వైజాగ్‌ పోర్టు, అరకులో 25 రోజులు పాటు షూటింగ్‌ చేసినట్టు ప్రకటించారు. అయితే ఏ ప్రాంతంలో షూటింగ్‌ చేశారో ఆ యజమాని నుంచి ఒక సర్టిఫికేట్‌ సమర్పించాలని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

Published on: Aug 10, 2023 01:13 PM