Andhra Pradesh: లోకేష్‌కు అప్పుడు సమాధానం చెబుతాం.. మంత్రి పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకా అయిన కుప్పం మున్సిపాలిటీగా..
Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకా అయిన కుప్పం మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో.. మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ లు కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. తాజాగా కుప్పంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత లోకేష్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, లోకేష్ మాటకు తాము రెచ్చిపోమని అన్నారు. లోకేష్ పద్ధతి మరిచి దుర్భాషలాడుతున్నారని ధ్వజమెత్తారు అయినా తాము స్పందించడం లేదన్నారు.
కుప్పం ప్రజల మనసు దోచుకోవడమే తమ పని అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 17వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాక లోకేష్ మాటలకు సమాధానం చెబుతామని, అప్పటి వరకు ఓపికగా ఉంటామని అన్నారు. మాజీ సీఎం కోడుకు అనే హోదాలో నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. కుప్పం ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. కుప్పం పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కుప్పం మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also read:
Retail Sales: రిటైల్ అమ్మకాల జోరు..దేశ ఆర్ధిక వ్యవస్థలో మెరుగుదల.. సేల్స్ ఎంత పెరిగాయంటే..
Cyber Attack: కంపెనీ అకౌంట్‌పై సైబర్ ఎటాక్.. అరగంటలోనే రూ. 1.28 కోట్లు కొల్లగొట్టారు..